చిత్త మెఱఁగక పతిసేవ లేమి సేయుమనే
(॥పల్లవి॥)
చిత్త మెఱఁగక పతిసేవ లేమి సేయుమనే-
వత్తుక యాతని నన్నీ నడిగి రావే
(॥చిత్త॥)
చెప్పరానిమాఁటలకుఁ జెవులొగ్గఁబోతేను
కుప్పవడి తమకమే గుబ్బతిలును
ముప్పిరినవ్వులు సారె మూటగట్టఁ బోతేను
చిప్పిలుఁజెమటలే చిందఁజొచ్చును
(॥చిత్త॥)
పిలువని పేరటముపెండ్లికిఁ బొతేను
నిలువున నివ్వెరగులే నిండఁజొచ్చును
బలిమి చుట్టరికాలు పచారించఁ బోతెను
వులివచ్చివలపులే వుమ్మగిలును
(॥చిత్త॥)
వొక్కమాఁటె సరసాన వొడిగట్టఁబోతేను
మొక్కలముతోఁ బోఁకముడి వీడును
యిక్కడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
కక్కసించి కూడితే కాయే పండవును
(||pallavi||)
sitta mĕṟam̐gaga padiseva lemi seyumane-
vattuga yādani nannī naḍigi rāve
(||sitta||)
sĕpparānimām̐ṭalagum̐ jĕvulŏggam̐bodenu
kuppavaḍi tamagame gubbadilunu
muppirinavvulu sārĕ mūḍagaṭṭam̐ bodenu
sippilum̐jĕmaḍale siṁdam̐jŏchchunu
(||sitta||)
piluvani peraḍamubĕṁḍligim̐ bŏdenu
niluvuna nivvĕragule niṁḍam̐jŏchchunu
balimi suṭṭarigālu pasāriṁcham̐ bodĕnu
vulivachchivalabule vummagilunu
(||sitta||)
vŏkkamām̐ṭĕ sarasāna vŏḍigaṭṭam̐bodenu
mŏkkalamudom̐ bom̐kamuḍi vīḍunu
yikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
kakkasiṁchi kūḍide kāye paṁḍavunu