Sirugaalai vachchedevaro .. seli sempa gichcha

చిరుగాలై వచ్చేదెవరో .. చెలి చెంప గిచ్చ
Year
Language

పల్లవి:

చిరుగాలై వచ్చేదెవరో ..చెలి చెంప గిచ్చేదెవరో
చిరకాలం నిలిచేదెవరో ఎవరో వారెవరో
అలలాగ వచ్చేదెవరో ..అరచేయి పట్టేదెవరో
అనురాగం పంచేదెవరో ఎవరో వారెవరో
ఎవరంటే నీ వెంట నేనేలే
నేనంటే నిలువెల్లా నీవేలే
నీవంటే తనువెల్లా ప్రేమేలే .. ప్రేమించే వేళయిందో

చరణం 1:

ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు
ప్రేమరేఖ దాటెనే ఇలా పదాలు
ప్రేమకిక వేసెనే ఇలా ప్రాయాలు
ఏం మాయ ఏం చేస్తుందో
ప్రేమలేఖ రాసెనే ఇలా పెదాలు
ప్రేమలాలి కోరెనే ఇలా క్షణాలు
ప్రేమలోతు చేరెనే పది ప్రాణాలు
ఈ హాయి ఎటుపోతుందో ॥

చరణం 2:

నవ్వావంటే నువ్వు ఆ నవ్వే గువ్వై తారాజువ్వై
నాలో ఏఁమాయెనో
రువ్వావంటే చూపు ఆ చూపే చేపై సిగ్గై చెరువై
లోలో ఏఁమాయెనో
ముసినవ్వుకు మనసే లేత మొగ్గ వేసునో
కొనచూపుకు వయసే రేకు విచ్చునో
పసిరేకుల సొగసే నేడు పూత పూసెనో
ఆ పూవు ప్రేమైందో ఏమో...

pallavi:

sirugālai vachchedĕvaro ..sĕli sĕṁpa gichchedĕvaro
siragālaṁ nilisedĕvaro ĕvaro vārĕvaro
alalāga vachchedĕvaro ..araseyi paṭṭedĕvaro
anurāgaṁ paṁchedĕvaro ĕvaro vārĕvaro
ĕvaraṁṭe nī vĕṁṭa nenele
nenaṁṭe niluvĕllā nīvele
nīvaṁṭe tanuvĕllā premele .. premiṁche veḽayiṁdo

saraṇaṁ 1:

premalekha rāsĕne ilā pĕdālu
premarekha dāḍĕne ilā padālu
premagiga vesĕne ilā prāyālu
eṁ māya eṁ sestuṁdo
premalekha rāsĕne ilā pĕdālu
premalāli korĕne ilā kṣhaṇālu
premalodu serĕne padi prāṇālu
ī hāyi ĕḍuboduṁdo ||

saraṇaṁ 2:

navvāvaṁṭe nuvvu ā navve guvvai tārājuvvai
nālo em̐māyĕno
ruvvāvaṁṭe sūbu ā sūbe sebai siggai sĕruvai
lolo em̐māyĕno
musinavvugu manase leda mŏgga vesuno
kŏnasūbugu vayase regu vichchuno
pasiregula sŏgase neḍu pūda pūsĕno
ā pūvu premaiṁdo emo...