Sinnadaanavaidenemi sekkulunokkee naadamdu

చిన్నదానవైతేనేమి చెక్కులునొక్కీ నాతఁడు
Language

(॥పల్లవి॥)
చిన్నదానవైతేనేమి చెక్కులునొక్కీ నాతఁడు
చన్నుల నొరసి నీవూ జయము చేకొనవే

(॥చిన్న॥)
చనవిచ్చి కొలువులో సారె సుద్దులడిగీ
మనసురా నాతనితో మాటలాడవే
పెనఁగి పెనఁగి నిన్నుఁ బ్రియమున లాలించీ
చెనకుచు నీవు నిట్టె చిరునవ్వు నవ్వవే

(॥చిన్న॥)
ముచ్చటతో నే పొద్దూ నీ మొగమే తప్పకచూచీ
కచ్చు పెట్టి యెదుటనే కాచుకుండవే
పచ్చడము గప్పి నీకు బాఁతి పడి వేఁడుకొనీ
పచ్చిదేర నియ్యకొని పాదాలు నీ వొత్తవే

(॥చిన్న॥)
లలిమీరి వేడుకతో లాచీ నీపొందులకు
కలపుకోలు సేసుక కాఁగిలించవే
యెలమి శ్రీవేంకటేశుఁడేలె నలమేల్మంగవు
కలకాలమును నీవూఁ గాఁపురము సేయవే

(||pallavi||)
sinnadānavaidenemi sĕkkulunŏkkī nādam̐ḍu
sannula nŏrasi nīvū jayamu segŏnave

(||sinna||)
sanavichchi kŏluvulo sārĕ suddulaḍigī
manasurā nādanido māḍalāḍave
pĕnam̐gi pĕnam̐gi ninnum̐ briyamuna lāliṁchī
sĕnagusu nīvu niṭṭĕ sirunavvu navvave

(||sinna||)
muchchaḍado ne pŏddū nī mŏgame tappagasūsī
kachchu pĕṭṭi yĕduḍane kāsuguṁḍave
pachchaḍamu gappi nīgu bām̐ti paḍi vem̐ḍugŏnī
pachchidera niyyagŏni pādālu nī vŏttave

(||sinna||)
lalimīri veḍugado lāsī nībŏṁdulagu
kalabugolu sesuga kām̐giliṁchave
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍelĕ nalamelmaṁgavu
kalagālamunu nīvūm̐ gām̐puramu seyave