Sinnadaanavaa neevu siggulela pemchevu

చిన్నదానవా నీవు సిగ్గులేల పెంచేవు
Language

(॥పల్లవి॥)
చిన్నదానవా నీవు సిగ్గులేల పెంచేవు
సన్నలనే మోవితేనె చవిచూపవమ్మా

(॥చిన్న॥)
మొక్కేరు చెలులెల్లా మొగమెత్తి చూడవమ్మ
మక్కువ నీపతితోడ మాఁటాడవమ్మా
చక్కనిదాన వింతులచనవు చేకొనవమ్మ
పక్కన నీవాతనికి పాదాలొత్తమమ్మా

(॥చిన్న॥)
వేమారుఁ జేసె చెలుల విన్నపాలు వినవమ్మ
చేముట్టి విభునిసేవ సేయవమ్మా
మామండాటాలకు నీకు మన్నన లొసఁగవమ్మ
నాముదేర మగనితో నవ్వవమ్మా

(॥చిన్న॥)
భావించి నీచెలుల పంతము చెల్లించవమ్మ
శ్రీవేంకటేశుఁ డేలెఁ జెనకవమ్మ
కైవశమో యిందరికిఁ గాఁగరుణించవమ్మ
నీవు నీవూఁ గూడి యిట్టె నెలకొనరమ్మా

(||pallavi||)
sinnadānavā nīvu siggulela pĕṁchevu
sannalane movidenĕ savisūbavammā

(||sinna||)
mŏkkeru sĕlulĕllā mŏgamĕtti sūḍavamma
makkuva nībadidoḍa mām̐ṭāḍavammā
sakkanidāna viṁtulasanavu segŏnavamma
pakkana nīvādanigi pādālŏttamammā

(||sinna||)
vemārum̐ jesĕ sĕlula vinnabālu vinavamma
semuṭṭi vibhuniseva seyavammā
māmaṁḍāḍālagu nīgu mannana lŏsam̐gavamma
nāmudera maganido navvavammā

(||sinna||)
bhāviṁchi nīsĕlula paṁtamu sĕlliṁchavamma
śhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐ jĕnagavamma
kaivaśhamo yiṁdarigim̐ gām̐garuṇiṁchavamma
nīvu nīvūm̐ gūḍi yiṭṭĕ nĕlagŏnarammā