చింతతోడ నన్నుఁ జూచి సిగ్గువడుకొంటిగాక
(॥పల్లవి॥)
చింతతోడ నన్నుఁ జూచి సిగ్గువడుకొంటిగాక
యింతలో నీ తెరువు రా మిందుకేల కోపము
(॥చింత॥)
చెక్కునఁ జేయిడఁబోతే శిరసుపువ్వులు రాలె
అక్కరతో నవ్వితిఁబో అందుకే నేను
నిక్కిచూచి జంకించేవు నిన్ను నేఁ దడవితినా
చక్కని వీ రమణుఁడ చాలుఁజాలుఁ గోపము
(॥చింత॥)
నిట్టూరుపు నించఁబోతే నిండ మేను చెమరించె
అట్టె కసరుకొంటిఁబో అందుకే నేను
నెట్టిన దూరే వందుకు నీతో నలిగితినా
వట్టినేరా లీడ లేవు వద్దు వద్దు కోపము
(॥చింత॥)
కాఁకల నొరగఁబోతే కందువ నీ మేను సోఁకె
ఆఁకల బెదరితిఁబో అందుకే నేను
యేఁకటతో శ్రీ వేంకటేశ యిట్టె కూడితివి
వూఁకొనఁగఁ జోటులేదు వుడివోయఁ గోపము
(||pallavi||)
siṁtadoḍa nannum̐ jūsi sigguvaḍugŏṁṭigāga
yiṁtalo nī tĕruvu rā miṁdugela kobamu
(||siṁta||)
sĕkkunam̐ jeyiḍam̐bode śhirasubuvvulu rālĕ
akkarado navvidim̐bo aṁduge nenu
nikkisūsi jaṁkiṁchevu ninnu nem̐ daḍavidinā
sakkani vī ramaṇum̐ḍa sālum̐jālum̐ gobamu
(||siṁta||)
niṭṭūrubu niṁcham̐bode niṁḍa menu sĕmariṁchĕ
aṭṭĕ kasarugŏṁṭim̐bo aṁduge nenu
nĕṭṭina dūre vaṁdugu nīdo naligidinā
vaṭṭinerā līḍa levu vaddu vaddu kobamu
(||siṁta||)
kām̐kala nŏragam̐bode kaṁduva nī menu som̐kĕ
ām̐kala bĕdaridim̐bo aṁduge nenu
yem̐kaḍado śhrī veṁkaḍeśha yiṭṭĕ kūḍidivi
vūm̐kŏnam̐gam̐ joḍuledu vuḍivoyam̐ gobamu