సింగారించుకోనీరాదా చెనకే విప్పుడే వచ్చి
(॥పల్లవి॥)
సింగారించుకోనీరాదా చెనకే విప్పుడే వచ్చి
అంగన నీచేఁతలకు నౌఁగాదనఁజాలదు
(॥సింగా॥)
సుదతి యద్దము చూచి చుక్కబొట్టు వెట్టుకొఁగా
వుదుటున నిప్పుడే వొడివట్టేవు
పొదిగి కొప్పునిండా పూవులు ముడుచుకోఁగా
చదురులాడుత వచ్చి చన్నులంటేవు
(॥సింగా॥)
కామిని కనుఁగొనల కాటుక వెట్టుకోఁగా
ప్రేమముతో దమ్ములము పెట్టవచ్చేవు
దోమటి గందమునుఁ గస్తూరి యలదుకొగా
కామించి యంతలోనే కాఁగిలించేవు
(॥సింగా॥)
పక్కన నలమేల్‌మంగ పట్టుచీర గట్టుకోఁగా
మొక్కలాన వేడుకతో మోవి యానేవు
ఇక్కువ శ్రీవేంకటేశ యీకె తెరవేసుకోఁగా
చిక్కించుక మన్నించి చిమ్మిరేఁచేవు
(||pallavi||)
siṁgāriṁchugonīrādā sĕnage vippuḍe vachchi
aṁgana nīsem̐talagu naum̐gādanam̐jāladu
(||siṁgā||)
sudadi yaddamu sūsi sukkabŏṭṭu vĕṭṭugŏm̐gā
vuduḍuna nippuḍe vŏḍivaṭṭevu
pŏdigi kŏppuniṁḍā pūvulu muḍusugom̐gā
sadurulāḍuda vachchi sannulaṁṭevu
(||siṁgā||)
kāmini kanum̐gŏnala kāḍuga vĕṭṭugom̐gā
premamudo dammulamu pĕṭṭavachchevu
domaḍi gaṁdamunum̐ gastūri yaladugŏgā
kāmiṁchi yaṁtalone kām̐giliṁchevu
(||siṁgā||)
pakkana nalamelmaṁga paṭṭusīra gaṭṭugom̐gā
mŏkkalāna veḍugado movi yānevu
ikkuva śhrīveṁkaḍeśha yīgĕ tĕravesugom̐gā
sikkiṁchuga manniṁchi simmirem̐sevu