చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా
పల్లవి:
చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా... వేస్తావే.. వల నీతో వేగేదెలా
ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కల
కొన్నాళ్ళే.. అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా
కడదాక ప్రేమించే దారేదో పోల్చేదెలా
చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా
చరణం 1:
నిన్నే ఇలా... చేరగా... మాటే మార్చి మాయే చెయ్యాలా
నన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమేలా
ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుందలా
నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తోందే నీసంకెలా
కొంచం మధురము కొంచం విరహము ఇంతలో నువ్వు నరకం
కొంచం స్వర్గము కొంచం శాంతము గొంతులో చాలు గరళం
కొంచం పరువము కొంచం ప్రళయము గుండెనే కోయు గాయం
కొంచం మౌనము కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం
చరణం 2:
ఇన్నాళ్ళుగా సాగినా ప్రేమనుంచి వేరై పోతున్నా
మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా
ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా
ఒక్కో క్షణం ఆ సంతోషం నాతో పాటు సాగేదెలా ఎలా
చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అలా వేస్తావే వల నీతో వేగేదెలా
ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందనీ కల
కొన్నాళ్ళే.. అందంగా ఊరిస్తోంది ఆపై చేదెక్కుతోందిలా
కడదాక ప్రేమించే దారేదో పోల్చేదెలా
pallavi:
silibigā sūstāvalā pĕnavestāvilā ninne ābedĕlā
sivarigi nuvve alā... vestāve.. vala nīdo vegedĕlā
o premā.. kannullo vāle roju ĕṁto bāguṁdanī kala
kŏnnāḽḽe.. aṁdaṁgā ūristoṁdi ābai sedĕkkudoṁdilā
kaḍadāga premiṁche dāredo polsedĕlā
silibigā sūstāvalā pĕnavestāvilā ninne ābedĕlā
sivarigi nuvve alā vestāve vala nīdo vegedĕlā
saraṇaṁ 1:
ninne ilā... seragā... māḍe mārsi māye sĕyyālā
nanne iga nannugā premiṁchani premelā
ūbire āgedāgā edo ŏga toḍuṁdalā
nanniṁtagā ūriṁchestū allestoṁde nīsaṁkĕlā
kŏṁchaṁ madhuramu kŏṁchaṁ virahamu iṁtalo nuvvu naragaṁ
kŏṁchaṁ svargamu kŏṁchaṁ śhāṁtamu gŏṁtulo sālu garaḽaṁ
kŏṁchaṁ paruvamu kŏṁchaṁ praḽayamu guṁḍĕne koyu gāyaṁ
kŏṁchaṁ maunamu kŏṁchaṁ gānamu ĕṁdugī iṁdrajālaṁ
saraṇaṁ 2:
innāḽḽugā sāginā premanuṁchi verai podunnā
maḽḽī maro guṁḍĕdo snehaṁ kori vĕḽudunnā
premane dāhaṁ tīrse sāyaṁ kosaṁ vesānilā
ŏkko kṣhaṇaṁ ā saṁtoṣhaṁ nādo pāḍu sāgedĕlā ĕlā