చిగురుఁబెదవి నిండె సింగారములు నేఁడు
(॥పల్లవి॥)
చిగురుఁబెదవి నిండె సింగారములు నేఁడు
నగితివి మేలుమేలు నల్లఁబల్లిచెన్నుఁడా
(॥॥)
చెక్కులఁ జెమట గారీ సిగ్గులు మోమున నూరీ
యెక్కడనుండి వచ్చితి విందాఁకాను
మొక్కేము నీకిదివో మొనగోరు కడువాఁడి
మొక్కలము లిఁకనేల మోహించితి నీకును
(॥॥)
తురు మించుక చెదరె తోడనే సందులదరె
చిరుతపను లేమేమి సేసితివి
గురుతై సేవసేసేము కుచములు గట్లు
జరుపులఁ బెట్ట కిఁక సతినై తి నీకును
(॥॥)
కాయమెల్లాఁ బులకించీ కళలు నీయందు మించీ
చేయిచ్చి నన్నేలితివి శ్రీవేంకటేశ
నీ యిచ్చ రతిసేసితివి నిండు నాపిఱుఁదు వేఁగు
పాయకు నన్నిఁక నిట్టె బత్తిసేసే నీకును
(||pallavi||)
sigurum̐bĕdavi niṁḍĕ siṁgāramulu nem̐ḍu
nagidivi melumelu nallam̐ballisĕnnum̐ḍā
(||||)
sĕkkulam̐ jĕmaḍa gārī siggulu momuna nūrī
yĕkkaḍanuṁḍi vachchidi viṁdām̐kānu
mŏkkemu nīgidivo mŏnagoru kaḍuvām̐ḍi
mŏkkalamu lim̐kanela mohiṁchidi nīgunu
(||||)
turu miṁchuga sĕdarĕ toḍane saṁduladarĕ
sirudabanu lememi sesidivi
gurudai sevasesemu kusamulu gaṭlu
jarubulam̐ bĕṭṭa kim̐ka sadinai ti nīgunu
(||||)
kāyamĕllām̐ bulagiṁchī kaḽalu nīyaṁdu miṁchī
seyichchi nannelidivi śhrīveṁkaḍeśha
nī yichcha radisesidivi niṁḍu nābiṟum̐du vem̐gu
pāyagu nannim̐ka niṭṭĕ battisese nīgunu