సిగ్గువిడిచి పనులు సేతురా నీవు
(॥పల్లవి॥)
సిగ్గువిడిచి పనులు సేతురా నీవు
వెగ్గళించి యీచేఁతనే వెలఁది చెప్పించెను
(॥సిగ్గు॥)
చెంతనుండి యాపె నీకు చేతుతెత్తి మొక్కి తేను
వంతులకుఁ జేసేవు వంచన నీవు
వింతవారు చూచితేను వెస నిన్ను నవ్వరా
యెంతటిది యిది యని యింతి నాడుకొనరా
(॥సిగ్గు॥)
పైకొనియాపె నీపై పదములు వాడితేను
ఆకడ నాపెపై పా(ప?) దా లట్టె వాడేవు
దాకొని పొరుగు వారు తగ వింటేనే నవ్వరా
కాకుసేయించిననీకాంత వాడుకొనరా
(॥సిగ్గు॥)
అలమేల్మంగ నీపాదా లరతఁ గట్టుకొంటేను
పిలిచి యాపెను రానఁ బెట్టుకొంటివి
కలసి శ్రీవేంకటేశ కన్నవారే నవ్వరా
బలువురా లిదియని భామ నాడుకోరా
(||pallavi||)
sigguviḍisi panulu sedurā nīvu
vĕggaḽiṁchi yīsem̐tane vĕlam̐di sĕppiṁchĕnu
(||siggu||)
sĕṁtanuṁḍi yābĕ nīgu sedudĕtti mŏkki tenu
vaṁtulagum̐ jesevu vaṁchana nīvu
viṁtavāru sūsidenu vĕsa ninnu navvarā
yĕṁtaḍidi yidi yani yiṁti nāḍugŏnarā
(||siggu||)
paigŏniyābĕ nībai padamulu vāḍidenu
āgaḍa nābĕbai pā(pa?) dā laṭṭĕ vāḍevu
dāgŏni pŏrugu vāru taga viṁṭene navvarā
kāguseyiṁchinanīgāṁta vāḍugŏnarā
(||siggu||)
alamelmaṁga nībādā laradam̐ gaṭṭugŏṁṭenu
pilisi yābĕnu rānam̐ bĕṭṭugŏṁṭivi
kalasi śhrīveṁkaḍeśha kannavāre navvarā
baluvurā lidiyani bhāma nāḍugorā