సిగ్గువడి నీలో నీవే చిరునవ్వేల నవ్వేవు
(॥పల్లవి॥)
సిగ్గువడి నీలో నీవే చిరునవ్వేల నవ్వేవు
అగ్గలమై మాతోనైనా నాలోచించరాదా
(॥సిగ్గు॥)
వెలఁది నీచెవిలోన విన్నవించినయందుకు -
నలరి మారుత్తరము లానతీరాదా
చలివాయ గోర నూఁది సన్నసేసినయందుకు
తిలకించి యీపెచేతఁ దెలుసుకోరాదా
(॥సిగ్గు॥)
చీటి వ్రాసి నీచేతికి చెలి యిచ్చినయందుకు
పాటించి యుద్ధములు చెప్పఁగరాదా
తాటించి ప్రియములు చెప్పితప్పక చూచినందుకు
జూటరితనాన మేను సోద నియ్యరాదా
(॥సిగ్గు॥)
కాఁగిటిలో వినయాలు కాంత సేసినయందుకు
చేఁగదేర నిందరిలోఁ జెప్పుకోరాదా
వీఁగక శ్రీవేంకటేశ వెస నన్నుఁ గూడితివి
మాఁగిన మోవి యిచ్చి మన్నించరాదా
(||pallavi||)
sigguvaḍi nīlo nīve sirunavvela navvevu
aggalamai mādonainā nālosiṁcharādā
(||siggu||)
vĕlam̐di nīsĕvilona vinnaviṁchinayaṁdugu -
nalari māruttaramu lānadīrādā
salivāya gora nūm̐di sannasesinayaṁdugu
tilagiṁchi yībĕsedam̐ dĕlusugorādā
(||siggu||)
sīḍi vrāsi nīsedigi sĕli yichchinayaṁdugu
pāḍiṁchi yuddhamulu sĕppam̐garādā
tāḍiṁchi priyamulu sĕppidappaga sūsinaṁdugu
jūḍaridanāna menu soda niyyarādā
(||siggu||)
kām̐giḍilo vinayālu kāṁta sesinayaṁdugu
sem̐gadera niṁdarilom̐ jĕppugorādā
vīm̐gaga śhrīveṁkaḍeśha vĕsa nannum̐ gūḍidivi
mām̐gina movi yichchi manniṁcharādā