సిగ్గువడ్డ(డ?) నిఁకనేలే చెక్కుచేతితో
(॥పల్లవి॥)
సిగ్గువడ్డ(డ?) నిఁకనేలే చెక్కుచేతితో
యెగ్గుపట్టని నీవంటి యిచ్చకురాలికిని
(॥సిగ్గు॥)
పెనఁగఁగవద్దుగాని ప్రియములు చెప్పవచ్చు
చెనకితేఁ బతితోను చెలియకును
కినియఁగవద్దుగాని కేలెత్తి మొక్కఁగవచ్చు
వినయముతోడ వివేకియైనదానికి
(॥సిగ్గు॥)
జంకించవద్దుగాని సరసములాడవచ్చు
అంకెఁ దనకుఁ బొఁదైనయతనితోను
మంకు చెప్పవద్దుగాని మర్మము లంటఁగవచ్చు
సంకెలేని యట్టినెరజాణయైనదానికి
(॥సిగ్గు॥)
వేసాలు వద్దుగాని వేడుక సేయఁగవచ్చు
అసిచ్చి తనుకు మేలైనవానితో
సేసవెట్టి నిన్నీతఁడే శ్రీవేంకటేశుఁడు గూడె
సేసినట్టౌనే నీబోఁటిచెలియైనదానికి
(||pallavi||)
sigguvaḍḍa(ḍa?) nim̐kanele sĕkkusedido
yĕggubaṭṭani nīvaṁṭi yichchagurāligini
(||siggu||)
pĕnam̐gam̐gavaddugāni priyamulu sĕppavachchu
sĕnagidem̐ badidonu sĕliyagunu
kiniyam̐gavaddugāni kelĕtti mŏkkam̐gavachchu
vinayamudoḍa vivegiyainadānigi
(||siggu||)
jaṁkiṁchavaddugāni sarasamulāḍavachchu
aṁkĕm̐ danagum̐ bŏm̐dainayadanidonu
maṁku sĕppavaddugāni marmamu laṁṭam̐gavachchu
saṁkĕleni yaṭṭinĕrajāṇayainadānigi
(||siggu||)
vesālu vaddugāni veḍuga seyam̐gavachchu
asichchi tanugu melainavānido
sesavĕṭṭi ninnīdam̐ḍe śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
sesinaṭṭaune nībom̐ṭisĕliyainadānigi