Sigguvada dimchugamtaa selulellaam joodamgaanu

సిగ్గువడ దించుకంతా చెలులెల్లాఁ జూడఁగాను
Language

(॥పల్లవి॥)
సిగ్గువడ దించుకంతా చెలులెల్లాఁ జూడఁగాను
బిగ్గెఁ గాఁగిలించుకొనీఁ బ్రియమెంతోకాని

(॥సిగ్గు॥)
వేవేలు చుట్టరికాలు వేడుకతో నెరపీని
వావి నాపె నీకేమిగావలెనోకాని
దేవులవలెఁ గడు హత్తిన సేవలెల్లాఁ జేసీ
భావించితే నెట్టి వొడఁబడికలోకాని

(॥సిగ్గు॥)
చెప్పరాని బత్తి నీపైఁ జేసి సేసి చూపీని
యెప్పుడూ మీ నేస్తమ లేఁటివోకాని
వొప్పగుపెండ్లికూఁతురే వొద్దనే కాచుకున్నది
చెప్పరాని సలిగెంత చెల్లించేవోకాని

(॥సిగ్గు॥)
నాఁటుకొన్న తమితోడ నవ్వులెల్లా నవ్వీని
చాటువైన మీలో నేమి సన్నలోకాని
యీటున శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మాటలాడీ నాపె నీపై మచ్చికెంతోకాని

(||pallavi||)
sigguvaḍa diṁchugaṁtā sĕlulĕllām̐ jūḍam̐gānu
biggĕm̐ gām̐giliṁchugŏnīm̐ briyamĕṁtogāni

(||siggu||)
vevelu suṭṭarigālu veḍugado nĕrabīni
vāvi nābĕ nīgemigāvalĕnogāni
devulavalĕm̐ gaḍu hattina sevalĕllām̐ jesī
bhāviṁchide nĕṭṭi vŏḍam̐baḍigalogāni

(||siggu||)
sĕpparāni batti nībaim̐ jesi sesi sūbīni
yĕppuḍū mī nestama lem̐ṭivogāni
vŏppagubĕṁḍligūm̐ture vŏddane kāsugunnadi
sĕpparāni saligĕṁta sĕlliṁchevogāni

(||siggu||)
nām̐ṭugŏnna tamidoḍa navvulĕllā navvīni
sāḍuvaina mīlo nemi sannalogāni
yīḍuna śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
māḍalāḍī nābĕ nībai machchigĕṁtogāni