Sigguvada dimchugamtaa selulellaa numdamgaanu

సిగ్గువడ దించుకంతా చెలులెల్లా నుండఁగాను
Language

(॥పల్లవి॥)
సిగ్గువడ దించుకంతా చెలులెల్లా నుండఁగాను
వెగ్గళించకుండా బుద్ది వేగమే చెప్పవయ్యా

(॥సిగ్గు॥)
వింతలేక నీతోను వేమారు నవ్వీని
కాంత యిదెవ్వతెయ్యా గబ్బితనాన
చెంతనుండి వూడిగాలు సేయవచ్చీ నూరకైనా
ఇంతచేఁతలాఁడి నీకు నెట్టు గలిగెనయ్యా

(॥సిగ్గు॥)
చుట్టమువలనే నీకు సుద్దులెల్లాఁ జెప్పీని
రట్టడి ఇదెవ్వతెయ్యా రాఁపుఁదనాన
వట్టివావులు సేసుక వలపు నీపైఁ జల్లీ
పుట్టుఁ గతకారి నీకెప్పుడు దొరకెనయ్యా

(॥సిగ్గు॥)
చలపట్టి నీతోను సంగాతాలు సేసీవి
నెలఁత ఇదెవ్వతెయ్యా నీటుఁదనాన
కలసితి నిటు నన్ను గక్కన శ్రీవేంకటేశ
యెలయింపు నయగారి యెట్టు నీకబ్బెనయ్యా

(||pallavi||)
sigguvaḍa diṁchugaṁtā sĕlulĕllā nuṁḍam̐gānu
vĕggaḽiṁchaguṁḍā buddi vegame sĕppavayyā

(||siggu||)
viṁtalega nīdonu vemāru navvīni
kāṁta yidĕvvadĕyyā gabbidanāna
sĕṁtanuṁḍi vūḍigālu seyavachchī nūragainā
iṁtasem̐talām̐ḍi nīgu nĕṭṭu galigĕnayyā

(||siggu||)
suṭṭamuvalane nīgu suddulĕllām̐ jĕppīni
raṭṭaḍi idĕvvadĕyyā rām̐pum̐danāna
vaṭṭivāvulu sesuga valabu nībaim̐ jallī
puṭṭum̐ gadagāri nīgĕppuḍu dŏragĕnayyā

(||siggu||)
salabaṭṭi nīdonu saṁgādālu sesīvi
nĕlam̐ta idĕvvadĕyyā nīḍum̐danāna
kalasidi niḍu nannu gakkana śhrīveṁkaḍeśha
yĕlayiṁpu nayagāri yĕṭṭu nīgabbĕnayyā