సిగ్గున దాఁచఁగరాదు చెప్పకపోదు
(॥పల్లవి॥)
సిగ్గున దాఁచఁగరాదు చెప్పకపోదు
వొగ్గి వేఁడుకొంటి మిదె వొప్పుగొనవయ్యా
(॥సిగ్గు॥)
పువ్వువంటి జవ్వనము పూఁటవూఁట కెచ్చఁగాను
నివ్వటిల్లె వలపులు నెలఁతకును
యివ్వల నింతి సుద్దులు యేమిచెప్పేమిఁక మీకు
రవ్వలు సేయక ఇట్టె రావయ్య యింటికి
(॥సిగ్గు॥)
పొట్టఁ బొరుగు నీ పొందు పొదులే కింపించఁగాను
నెట్టుకొని రమణికి నిండువావులు
వట్టిజోలి నీ ముందర వరవాతాలేమిటికి
గుట్టుతోనే రావయ్కా గక్కున నిట్టె యింటికి
(॥సిగ్గు॥)
చిత్తములోనియాసలు చిమ్మి గడురేఁచఁగాను
హత్తుకొనెఁ దమకము లంగనకును
కొత్తగా శ్రీవేంకటేశ కూడితి వీకె నింతలో
బత్తితో నిట్టె రావయ్యా బడి బడి నింటికి
(||pallavi||)
sigguna dām̐sam̐garādu sĕppagabodu
vŏggi vem̐ḍugŏṁṭi midĕ vŏppugŏnavayyā
(||siggu||)
puvvuvaṁṭi javvanamu pūm̐ṭavūm̐ṭa kĕchcham̐gānu
nivvaḍillĕ valabulu nĕlam̐tagunu
yivvala niṁti suddulu yemisĕppemim̐ka mīgu
ravvalu seyaga iṭṭĕ rāvayya yiṁṭigi
(||siggu||)
pŏṭṭam̐ bŏrugu nī pŏṁdu pŏdule kiṁpiṁcham̐gānu
nĕṭṭugŏni ramaṇigi niṁḍuvāvulu
vaṭṭijoli nī muṁdara varavādālemiḍigi
guṭṭudone rāvaygā gakkuna niṭṭĕ yiṁṭigi
(||siggu||)
sittamuloniyāsalu simmi gaḍurem̐sam̐gānu
hattugŏnĕm̐ damagamu laṁganagunu
kŏttagā śhrīveṁkaḍeśha kūḍidi vīgĕ niṁtalo
battido niṭṭĕ rāvayyā baḍi baḍi niṁṭigi