సిగ్గులు విడుతురా చెల్లఁబో యెంతైనా
(॥పల్లవి॥)
సిగ్గులు విడుతురా చెల్లఁబో యెంతైనా
బగ్గన నన్నియు నేఁడు బాయిటనే పడెఁగా
(॥సిగ్గు॥)
మంతనాన నీవు నేను మాటలాడినసుద్దులు
అంతయు నాపె చెప్పీ నది యేఁటికి
వింతచుట్టా లిటు నీకు వేరే యెంత గలిగిన
పొంతనే రతులలోని భోగాలు చెప్పుదురా
(॥సిగ్గు॥)
మొక్కలాన నీకు నేను ముడిచినపువ్వులు
వొక్కట నాపె కొప్పులో నుండ నేఁటికి
తక్కక నీకు వేరే దాఁపిరము గలిగితే
వుక్కున నొకరి యెంగి లొకరికి నిత్తురా
(॥సిగ్గు॥)
కందువ మనయిద్దరి కాఁగిటి పరిమళము
అందమై యాపె చన్నుల నంటఁదగునా
యిందుకుఁగా శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
పొందుల సతులనెల్లా పొత్తు గలపుదురా
(||pallavi||)
siggulu viḍudurā sĕllam̐bo yĕṁtainā
baggana nanniyu nem̐ḍu bāyiḍane paḍĕm̐gā
(||siggu||)
maṁtanāna nīvu nenu māḍalāḍinasuddulu
aṁtayu nābĕ sĕppī nadi yem̐ṭigi
viṁtasuṭṭā liḍu nīgu vere yĕṁta galigina
pŏṁtane radulaloni bhogālu sĕppudurā
(||siggu||)
mŏkkalāna nīgu nenu muḍisinabuvvulu
vŏkkaḍa nābĕ kŏppulo nuṁḍa nem̐ṭigi
takkaga nīgu vere dām̐piramu galigide
vukkuna nŏgari yĕṁgi lŏgarigi nitturā
(||siggu||)
kaṁduva manayiddari kām̐giḍi parimaḽamu
aṁdamai yābĕ sannula naṁṭam̐dagunā
yiṁdugum̐gā śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
pŏṁdula sadulanĕllā pŏttu galabudurā