Siggulu vadaguve seliya neevadanido

సిగ్గులు వడకువే చెలియ నీవతనితో
Language

(॥పల్లవి॥)
సిగ్గులు వడకువే చెలియ నీవతనితో
వొగ్గి కలసిమెలసి వుండుదువుగాని

(॥సిగ్గు॥)
యెడమాఁటలవల్లనే యింపులెల్లాఁ బొడమేవి
తడవే చే సన్నలనే తమి రేఁగేది
కడకంటి చూపులనే కడునాసలు వుట్టేవి
గడుసుపడి వుండితే కలిగే దేమున్నదే

(॥సిగ్గు॥)
సొలసే నేరుపులనే చుట్టరికము లయ్యేది
సెలవినవ్వులనే చిమ్మిరేఁగేది
కలకిచేఁతలనే నిక్కపుపొందు దగిలేది
వలవని గుట్టునను వచ్చేదేమున్నదే

(॥సిగ్గు॥)
చేసేటి వినయాలనే చెలిమి సతమయ్యేది
వేసరిని రతులనే వేడుకెక్కేది
ఆసతో శ్రీవేంకటేశుఁ డంతలోనె నిన్నుఁగూడె
మూసిదాఁచే సంతోసాన ముచ్చట యేమున్నదే

(||pallavi||)
siggulu vaḍaguve sĕliya nīvadanido
vŏggi kalasimĕlasi vuṁḍuduvugāni

(||siggu||)
yĕḍamām̐ṭalavallane yiṁpulĕllām̐ bŏḍamevi
taḍave se sannalane tami rem̐gedi
kaḍagaṁṭi sūbulane kaḍunāsalu vuṭṭevi
gaḍusubaḍi vuṁḍide kalige demunnade

(||siggu||)
sŏlase nerubulane suṭṭarigamu layyedi
sĕlavinavvulane simmirem̐gedi
kalagisem̐talane nikkabubŏṁdu dagiledi
valavani guṭṭunanu vachchedemunnade

(||siggu||)
seseḍi vinayālane sĕlimi sadamayyedi
vesarini radulane veḍugĕkkedi
āsado śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalonĕ ninnum̐gūḍĕ
mūsidām̐se saṁtosāna muchchaḍa yemunnade