Siggulane poraleeni simta nodim gattugoni

సిగ్గులనే పొరలీని చింత నొడిఁ గట్టుకొని
Language

(॥పల్లవి॥)
సిగ్గులనే పొరలీని చింత నొడిఁ గట్టుకొని
అగ్గలపు వినయాన??? నడుగరమ్మా

(॥సిగ్గు॥)
చెక్కులఁ జెమటలవె చిత్తము దెలియరాదు
ముక్కున నిట్టూర్పులవె ముచ్చటాడదు
పక్కనఁ దురుమువీడె కలమర్మము చెప్పదు
అక్కరతో సతికోర్కు లడుగరమ్మా

(॥సిగ్గు॥)
పులకలు మేన నవె పొందు లేమీఁ దెలుపదు
సెలవుల నవ్వుదేరీ చేఁత చూపదు
కళలు మోమున నవె కాననీదు తన గుట్టు
అలరి యింతికోరిక లడుగరమ్మా

(॥సిగ్గు॥)
నిండెఁ గన్నులఁ గెంపులు నెప మెరఁగఁనీదు
పండుమోవి గురుతదె భావించనీదు
మెండుగాఁగఁ దనుఁ గూడె మెచ్చి శ్రీవేంకటేశుఁడు
అండనే యీకె కోరికె లడుగరమ్మా

(||pallavi||)
siggulane pŏralīni siṁta nŏḍim̐ gaṭṭugŏni
aggalabu vinayāna??? naḍugarammā

(||siggu||)
sĕkkulam̐ jĕmaḍalavĕ sittamu dĕliyarādu
mukkuna niṭṭūrbulavĕ muchchaḍāḍadu
pakkanam̐ durumuvīḍĕ kalamarmamu sĕppadu
akkarado sadigorgu laḍugarammā

(||siggu||)
pulagalu mena navĕ pŏṁdu lemīm̐ dĕlubadu
sĕlavula navvuderī sem̐ta sūbadu
kaḽalu momuna navĕ kānanīdu tana guṭṭu
alari yiṁtigoriga laḍugarammā

(||siggu||)
niṁḍĕm̐ gannulam̐ gĕṁpulu nĕba mĕram̐gam̐nīdu
paṁḍumovi gurudadĕ bhāviṁchanīdu
mĕṁḍugām̐gam̐ danum̐ gūḍĕ mĕchchi śhrīveṁkaḍeśhum̐ḍu
aṁḍane yīgĕ korigĕ laḍugarammā