సిగ్గరి పెండ్లికూఁతుర సీతమ్మ
(॥పల్లవి॥)
సిగ్గరి పెండ్లికూఁతుర సీతమ్మ
దగ్గరి సింగారబొమ్మ తలవంచకమ్మా
(॥సిగ్గ॥)
అల్లనాఁడే రాఘవుడు హరివిల్లు విరిచెను
యెల్లి నేఁడే పెండ్లాడీ నిదివో నిన్ను
యెల్లగా జనకుఁడు నిన్నిచ్చీనట వీఁడె
వెల్లవిరి నీమాట వినవమ్మా
(॥సిగ్గ॥)
అదె పెండ్లితెర యెత్తి రండనే వసిష్ఠుఁ డుండి
చదివీ మంత్రాలు సేన చల్లనమ్మా
మొదల రామునికంటె ముంచి తలఁబాలు వోసి
సుదతి యాతని మోము చూడవమ్మా
(॥సిగ్గ॥)
కంకణదారాలు గట్టి కాలుదొక్కతివి మీరు
పొంకాన బువ్వ మందరో పొత్తుల నమ్మ
వుంకువ వావిలిపాట నుండి శ్రీ వేంకటగిరి
తెంకుల నిన్నుఁ గూడి తిరమాయనమ్మా
(||pallavi||)
siggari pĕṁḍligūm̐tura sīdamma
daggari siṁgārabŏmma talavaṁchagammā
(||sigga||)
allanām̐ḍe rāghavuḍu harivillu virisĕnu
yĕlli nem̐ḍe pĕṁḍlāḍī nidivo ninnu
yĕllagā janagum̐ḍu ninnichchīnaḍa vīm̐ḍĕ
vĕllaviri nīmāḍa vinavammā
(||sigga||)
adĕ pĕṁḍlidĕra yĕtti raṁḍane vasiṣhṭhum̐ ḍuṁḍi
sadivī maṁtrālu sena sallanammā
mŏdala rāmunigaṁṭĕ muṁchi talam̐bālu vosi
sudadi yādani momu sūḍavammā
(||sigga||)
kaṁkaṇadārālu gaṭṭi kāludŏkkadivi mīru
pŏṁkāna buvva maṁdaro pŏttula namma
vuṁkuva vāvilibāḍa nuṁḍi śhrī veṁkaḍagiri
tĕṁkula ninnum̐ gūḍi tiramāyanammā