Shreegaaram sududunnattu

శ్రీకారం చుడుతున్నట్టు
Year
Language

పల్లవి:

శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులేటు చూస్తున్నాయో మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరుబొమ్మా
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులేటు చూస్తున్నాయో మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరుబొమ్మా

జల జల జల జాజుల వాన
కిల కిల కిల కిన్నెర వీణ
మిల మిల మిన్నంచులపైన
మెలిదిరిగిన చంచల యాన
మధురోహల లాహిరిలోన
మదినూపే మదిరవె జాణ

చరణం 1:

నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తైనా నీ వెనకాలేమౌతున్నా
నీ వీపును ముల్లే గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు ..లావణ్యం పెట్టని పేరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు !

నీగాలై సోకినవారు గాలిబ్ గజలైపోతారు
నీ మేను తాకినవారు నిలువెల్లా విరులౌతారు
కవితవో ..యువతివో.. ఎవతివో..గుర్తించేదెట్టాగమ్మా !!

చరణం 2:

నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలివేయద్దు
వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు!

ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టు
అందాకా మారామ్మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుక్కాని
నడిమివో ..హరిణివో.. తరుణివో..మురిపించే ముద్దులగుమ్మ ....

pallavi:

śhrīgāraṁ suḍudunnaṭṭu kammani kalanāhvānistū
nī kanuleḍu sūstunnāyo mākkūḍā sūbiṁchammā
prāgāraṁ kaḍudunnaṭṭu rāboye paṁḍaga suṭṭū
nī guppiḍa edo guṭṭu dākkuṁde baṁgarubŏmmā
śhrīgāraṁ suḍudunnaṭṭu kammani kalanāhvānistū
nī kanuleḍu sūstunnāyo mākkūḍā sūbiṁchammā
prāgāraṁ kaḍudunnaṭṭu rāboye paṁḍaga suṭṭū
nī guppiḍa edo guṭṭu dākkuṁde baṁgarubŏmmā

jala jala jala jājula vāna
kila kila kila kinnĕra vīṇa
mila mila minnaṁchulabaina
mĕlidirigina saṁchala yāna
madhurohala lāhirilona
madinūbe madiravĕ jāṇa

saraṇaṁ 1:

nī naḍagalu nīvenā sūśhāvā enāḍainā
nī mĕttani aḍugula kiṁda paḍi naligina prāṇālĕnno
gamaniṁchavu kāstainā nī vĕnagālemaudunnā
nī vībunu mulle guchche kunugĕrugani sūbulu ĕnno
lāsyaṁ puṭṭina ūru ..lāvaṇyaṁ pĕṭṭani peru
lalanā tĕluso ledo nīgainā nī tīru !

nīgālai soginavāru gālip gajalaibodāru
nī menu tāginavāru niluvĕllā virulaudāru
kavidavo ..yuvadivo.. ĕvadivo..gurdiṁchedĕṭṭāgammā !!

saraṇaṁ 2:

nakṣhatrālĕnnaṁṭū lĕkkĕḍide emainaṭṭu
nī manasugu rĕkkalu kaṭṭu sukkallo vihariṁcheṭṭu
ĕkkaḍa nā vĕlugaṁṭū ĕppuḍu ĕdurŏstuṁdaṁṭū
sikkaḍi sīgaḍine sūstū niddurane vĕliveyaddu
veguvane lākkŏchcheṭṭu vĕnnĕlado dāraṁ kaṭṭu!

idigo vachchānaṁṭū takṣhaṇame hājarayeṭṭu
aṁdāgā mārāmmāni jogŏṭṭave ārāḍānni
pŏṁdiggā paḍugo rāṇi jāgāraṁ ĕṁdukkāni
naḍimivo ..hariṇivo.. taruṇivo..muribiṁche muddulagumma ....