పల్లవి:
షోలాపూర్... చెప్పులు పోయాయి
అహ... హ.. హ...
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
చరణం 1:
అరే రమణమూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళి మళ్ళి
నవ్వాలి తుళ్ళి తుళ్ళి.. అని పాడెను మళ్ళి మళ్ళి
అరే రమణమూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళి మళ్ళి
నవ్వాలి తుళ్ళి తుళ్ళి.. అని పాడెను మళ్ళి మళ్ళి
ఆ సందట్లో కన్నేసి కనిపెట్టి కాజేసాడెవడో
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షోలా షోలా షోలా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
చరణం 2:
ఇది షోలాపూర్ లెదరు.. అండ్ లైట్ ఏర్ ఫెదరు
సూటేస్తే ఎనీ వెదరు.. దీన్ని తొడిగి చూడు బ్రదరు
ఇది షోలాపూర్ లెదరు.. అండ్ లైట్ ఏర్ ఫెదరు
సూటేస్తే ఎనీ వెదరు.. దీన్ని తొడిగి చూడు బ్రదరు
అని మురిపించి మరిపించి కొనిపించాడు ఆ పొట్టోడు
షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
చరణం 3:
జత నెంబరేమో ఆరు.. వెల చూస్తే ఇరవైఆరు
తొడిగేను ఒక్కమారు.. వెళ్ళాను పాత ఊరు
జత నెంబరేమో ఆరు.. వెల చూస్తే ఇరవైఆరు
తొడిగేను ఒక్కమారు.. వెళ్ళాను పాత ఊరు
ఒకసారైన పాలిష్ కొట్టనిది కొట్టేసాడెవడో
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి
నా షోలాపూర్ చెప్పులు.. పెళ్ళిలో పోయాయి
దొరికితే ఎవరైనా ఇవ్వండి..
అహహహా..