Seyetti mokkidi sekkunokkidini

చేయెత్తి మొక్కితి చెక్కునొక్కితిని
Language

(॥పల్లవి॥)
చేయెత్తి మొక్కితి చెక్కునొక్కితిని
ఆ యెడ నీకెంత ఆసోదమో

(॥చేయె॥)
కప్పుర మిచ్చితి కాఁకలు చల్లితి
ముప్పిరిఁ జన్నులు మోపితివి
చెప్పర న న్నేమిసేయుమనే విఁక
అప్పటి నీకెంత ఆసోదమో

(॥చేయె॥)
మొగము చూపితిని ముచ్చటలాడితి
నిగిడి మోవితేనె యిచ్చితి
పగటులేలరా పచరించేవిఁక
ఆగపడేవు యెంత ఆసోదమో

(॥చేయె॥)
కందువ చూపితి కాఁగిటఁ గూడితి
సందడి నీమేలు చవిగొంటి
చిందురా సిగ్గు శ్రీవేంకటేశ్వర
అందరిలో నెంత యాసోదమో

(||pallavi||)
seyĕtti mŏkkidi sĕkkunŏkkidini
ā yĕḍa nīgĕṁta āsodamo

(||seyĕ||)
kappura michchidi kām̐kalu sallidi
muppirim̐ jannulu mobidivi
sĕppara na nnemiseyumane vim̐ka
appaḍi nīgĕṁta āsodamo

(||seyĕ||)
mŏgamu sūbidini muchchaḍalāḍidi
nigiḍi movidenĕ yichchidi
pagaḍulelarā pasariṁchevim̐ka
āgabaḍevu yĕṁta āsodamo

(||seyĕ||)
kaṁduva sūbidi kām̐giḍam̐ gūḍidi
saṁdaḍi nīmelu savigŏṁṭi
siṁdurā siggu śhrīveṁkaḍeśhvara
aṁdarilo nĕṁta yāsodamo