Seyave yadanivadda sedalellaanu

చేయవే యతనివద్ద సేతలెల్లాను
Language

(॥పల్లవి॥)
చేయవే యతనివద్ద సేతలెల్లాను
దాయనే నీతో నేను తప్పు లెంచేనటవే

(॥చేవ॥)
చెలువుని సొలసేవు చేరి మాట లడిగేవు
కలికితనాలు నీకు గలవే కదే
పలుమారు నవ్వేవు పానుపుపైఁ గూచుండేవు
చలమున యీవిద్యలు సాదించితి గదే

(॥చేవ॥)
కన్నుసన్నలు సేసేవు కాఁపురాన మెప్పిచేవు
అన్నియు నీమేనికినమరుఁ గదే
వన్నెలు వెట్టుకొనేవు వద్దఁ గూచుండవచ్చేవు
పన్నిలమాయలకు నేర్పరివి గదే

(॥చేవ॥)
మోవితేనె లడిగేవు మొక్కలెల్లా మొక్కేవు
రావాడిరతులకు రాజవు గదే
యీవేళ శ్రీవేంకటేశుఁ డేలినాఁడు నన్ను నిట్టె
దేవుళ్లిందరికిని దేవరపు గదవే

(||pallavi||)
seyave yadanivadda sedalĕllānu
dāyane nīdo nenu tappu lĕṁchenaḍave

(||seva||)
sĕluvuni sŏlasevu seri māḍa laḍigevu
kaligidanālu nīgu galave kade
palumāru navvevu pānububaim̐ gūsuṁḍevu
salamuna yīvidyalu sādiṁchidi gade

(||seva||)
kannusannalu sesevu kām̐purāna mĕppisevu
anniyu nīmeniginamarum̐ gade
vannĕlu vĕṭṭugŏnevu vaddam̐ gūsuṁḍavachchevu
pannilamāyalagu nerbarivi gade

(||seva||)
movidenĕ laḍigevu mŏkkalĕllā mŏkkevu
rāvāḍiradulagu rājavu gade
yīveḽa śhrīveṁkaḍeśhum̐ ḍelinām̐ḍu nannu niṭṭĕ
devuḽliṁdarigini devarabu gadave