Seyave yaadaniseva sittamu raanu

సేయవే యాతనిసేవ చిత్తము రాను
Language

(॥పల్లవి॥)
సేయవే యాతనిసేవ చిత్తము రాను
యీ యెడఁ గొంకంగనేలే యిల్లాండ్లకు

(॥సేయ॥)
చలములే వద్దుగాని సరసమెంతైనా మేలే
అలుకలే వద్దుగాని ఆసలెన్నియైనా మేలే
బలుములే వద్దుగాని పంతుమ లెన్నైనామేలే
నెలకొనవలచిననెలఁతలకు

(॥సేయ॥)
వాదించవద్దుగాని వాడిక లెన్నైనా మేలే
సోదించవద్దుగాని సొలపులెన్నైనా మేలే
బోదించవద్దుగాని పోరచి యెంతైనా మేలే
ఆదిగొని తమిగలయాఁడువారికి

(॥సేయ॥)
నెపములు వద్దుగాని నేరుపు లెన్నైనా మేలే
వుపములు వద్దుగాని వొద్దిక లెన్నైనా మేలే
ఇపుడే శ్రీవేంకటేశుఁడేలె నిన్ను నీవలెనే
తపము సేసిన తరుణులుకు

(||pallavi||)
seyave yādaniseva sittamu rānu
yī yĕḍam̐ gŏṁkaṁganele yillāṁḍlagu

(||seya||)
salamule vaddugāni sarasamĕṁtainā mele
alugale vaddugāni āsalĕnniyainā mele
balumule vaddugāni paṁtuma lĕnnaināmele
nĕlagŏnavalasinanĕlam̐talagu

(||seya||)
vādiṁchavaddugāni vāḍiga lĕnnainā mele
sodiṁchavaddugāni sŏlabulĕnnainā mele
bodiṁchavaddugāni porasi yĕṁtainā mele
ādigŏni tamigalayām̐ḍuvārigi

(||seya||)
nĕbamulu vaddugāni nerubu lĕnnainā mele
vubamulu vaddugāni vŏddiga lĕnnainā mele
ibuḍe śhrīveṁkaḍeśhum̐ḍelĕ ninnu nīvalĕne
tabamu sesina taruṇulugu