Seyamgalattallaa neevu seduvu gaaga

సేయఁగలట్టల్లా నీవు సేతువు గాక
Language

(॥పల్లవి॥)
సేయఁగలట్టల్లా నీవు సేతువు గాక
పాయపు మదమువానిఁ బనిగొన వసమా

(॥సేయఁ॥)
చెనకి యెవ్వతెకైనాఁ జేతులు చాఁచేవు నీవు
మనసు మర్మము లేమీ మరి యెంచవు
ఘనుఁడైన మగవాఁడు కడు మితిమీరితేను
చనవున నెవ్వరికిఁ జక్కఁబెట్ట వచ్చునా

(॥సేయఁ॥)
నంటున నెవ్వెతెఁ గన్నా నవ్వులు నవ్వేవు నీవు
అంట ముట్టఁ దగువేళ లని చూడవు
కంటులేని బలుదొర కక్కూరితి సేసితేను
యింటికాడ సతులెల్లా నిఁక దిద్దఁ గలరా

(॥సేయఁ॥)
గక్కన నెవ్వతెఁ గన్నా కాఁగిటఁ గూడేవు నీవు
తక్కిన నేరుపు లేమీఁ దలపోయవు
యిక్కడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
యెక్కడా జాణైనవాని నెలయించనగునా

(||pallavi||)
seyam̐galaṭṭallā nīvu seduvu gāga
pāyabu madamuvānim̐ banigŏna vasamā

(||seyam̐||)
sĕnagi yĕvvadĕgainām̐ jedulu sām̐sevu nīvu
manasu marmamu lemī mari yĕṁchavu
ghanum̐ḍaina magavām̐ḍu kaḍu midimīridenu
sanavuna nĕvvarigim̐ jakkam̐bĕṭṭa vachchunā

(||seyam̐||)
naṁṭuna nĕvvĕdĕm̐ gannā navvulu navvevu nīvu
aṁṭa muṭṭam̐ daguveḽa lani sūḍavu
kaṁṭuleni baludŏra kakkūridi sesidenu
yiṁṭigāḍa sadulĕllā nim̐ka diddam̐ galarā

(||seyam̐||)
gakkana nĕvvadĕm̐ gannā kām̐giḍam̐ gūḍevu nīvu
takkina nerubu lemīm̐ dalaboyavu
yikkaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
yĕkkaḍā jāṇainavāni nĕlayiṁchanagunā