Sevulaara vinare selulaala meegum jeppe

చెవులార వినరే చెలులాల మీకుఁ జెప్పే
Language

(॥పల్లవి॥)
చెవులార వినరే చెలులాల మీకుఁ జెప్పే
వివరించి యీ తగవు విచ్చిచెప్పరాదే

(॥చెవు॥)
యెఱుఁగుదులేవే తన కిచ్చలాడితే నేను
మఱపులేని యట్టిమంచిదానను
నెఱయ నెరుసువెట్టి నేరములెంచితేను
నెఱతనములతోడినిష్టూరి నేను

(॥చెవు॥)
తెలుసులేవే తన్ను దేవరంటాఁ బొగడితే
పలుమారు నాపైనే బత్తిసేసీని
అలిగి తనమర్మము లట్టె యెత్తి తిట్టితేను
చలపాదితనములజగరాఁగ నేను

(॥చెవు॥)
కంటిలేవే యిట్టె తన్ను కాఁగిలించి కూడితేను
జంటతో తనపాలికి జాణనైతివి
యింటిలో శ్రీవేంకటేశుఁడితని నే సోదించి
దంటతనపు సేఁతలతరుణి నేను

(||pallavi||)
sĕvulāra vinare sĕlulāla mīgum̐ jĕppe
vivariṁchi yī tagavu vichchisĕpparāde

(||sĕvu||)
yĕṟum̐guduleve tana kichchalāḍide nenu
maṟabuleni yaṭṭimaṁchidānanu
nĕṟaya nĕrusuvĕṭṭi neramulĕṁchidenu
nĕṟadanamuladoḍiniṣhṭūri nenu

(||sĕvu||)
tĕlusuleve tannu devaraṁṭām̐ bŏgaḍide
palumāru nābaine battisesīni
aligi tanamarmamu laṭṭĕ yĕtti tiṭṭidenu
salabādidanamulajagarām̐ga nenu

(||sĕvu||)
kaṁṭileve yiṭṭĕ tannu kām̐giliṁchi kūḍidenu
jaṁṭado tanabāligi jāṇanaidivi
yiṁṭilo śhrīveṁkaḍeśhum̐ḍidani ne sodiṁchi
daṁṭadanabu sem̐taladaruṇi nenu