Sevadere valabulu sediloni veedemu

చేవదేరె వలపులు చేతిలోని వీడెము
Language

(॥పల్లవి॥)
చేవదేరె వలపులు చేతిలోని వీడెము
తేవోయి భూపతిచెర్వు తిరువెంగళప్పఁడా

(॥॥)
బీరములాడఁ గ నీతోఁ బెనఁగులాడేమా
చేరి నీవు నవ్వఁ గానే చెనకేఁ గాక
రారాదా ఇంకనైన రంతులేల మాయింటికి
ధీరుఁడ విన్నిటా నీవు తిరువెంగళప్పఁడా

(॥॥)
గుట్టుతోడ నుండఁగాను కొంగువట్టి తీసేమా
జట్టిగొని పెండ్లాడఁగా జరసేఁ గాక
పొట్టఁ బొరుగబ్బె నీకు పొత్తునఁ గూచుండవోయి
దిట్టవౌదు వన్నిటాను తిరువెంగళప్పఁడా

(॥॥)
చలపట్టితే నీతో సారె బలిమిసేసేమా
ఆలరి కాఁగిలించఁగా నలమేఁ గాక
సులభమాయఁగదోయి చొక్కపునా తోడి రతి
తెలసి శ్రీవేంకటాద్రి తిరువెంగళప్పఁడా

(||pallavi||)
sevaderĕ valabulu sediloni vīḍĕmu
tevoyi bhūbadisĕrvu tiruvĕṁgaḽappam̐ḍā

(||||)
bīramulāḍam̐ ga nīdom̐ bĕnam̐gulāḍemā
seri nīvu navvam̐ gāne sĕnagem̐ gāga
rārādā iṁkanaina raṁtulela māyiṁṭigi
dhīrum̐ḍa vinniḍā nīvu tiruvĕṁgaḽappam̐ḍā

(||||)
guṭṭudoḍa nuṁḍam̐gānu kŏṁguvaṭṭi tīsemā
jaṭṭigŏni pĕṁḍlāḍam̐gā jarasem̐ gāga
pŏṭṭam̐ bŏrugabbĕ nīgu pŏttunam̐ gūsuṁḍavoyi
diṭṭavaudu vanniḍānu tiruvĕṁgaḽappam̐ḍā

(||||)
salabaṭṭide nīdo sārĕ balimisesemā
ālari kām̐giliṁcham̐gā nalamem̐ gāga
sulabhamāyam̐gadoyi sŏkkabunā toḍi radi
tĕlasi śhrīveṁkaḍādri tiruvĕṁgaḽappam̐ḍā