Settavatti teesinade selavugaaga

చెట్టవట్టి తీసినదే సెలవుగాక
Language

(॥పల్లవి॥)
చెట్టవట్టి తీసినదే సెలవుగాక
నెట్టన నాతనితోనే నిష్టూరమేఁటికే

(॥చెట్ట॥)
చింతలెల్లాఁ దీరె నింకాఁ జెక్కుచే యేమిటికే
అంతటా విచారించేనంటే నూయి
కాంతుఁడు మతిలో మొక్కెఁ గన్నుల దీవించితివి
యెంతకెంతదొరతోడ నెచ్చుకుందులేటికే

(॥చెట్ట॥)
తనువు చెమటఁ దోఁగె తాప మింకా నేఁటికే
కనుఁగొంటె నింతటాఁ జీకటే వెలుఁగు
మొనగోర గీరెఁ బతి మోహమున కేరువారె
వనిత బలువునితో వావాదమేఁటికే

(॥చెట్ట॥)
సేస దలమీఁద మోఁచె సిగ్గులింకా నేఁటికే
పోసరించి వోరిచితేఁ బూవే పిందె
ఆసల శ్రీవేంకటేశుఁ డాదరించి నిన్నుఁ గూడె
పాసికూడేపతితోడఁ బంతమాడనేఁటికే

(||pallavi||)
sĕṭṭavaṭṭi tīsinade sĕlavugāga
nĕṭṭana nādanidone niṣhṭūramem̐ṭige

(||sĕṭṭa||)
siṁtalĕllām̐ dīrĕ niṁkām̐ jĕkkuse yemiḍige
aṁtaḍā visāriṁchenaṁṭe nūyi
kāṁtum̐ḍu madilo mŏkkĕm̐ gannula dīviṁchidivi
yĕṁtagĕṁtadŏradoḍa nĕchchuguṁduleḍige

(||sĕṭṭa||)
tanuvu sĕmaḍam̐ dom̐gĕ tāba miṁkā nem̐ṭige
kanum̐gŏṁṭĕ niṁtaḍām̐ jīgaḍe vĕlum̐gu
mŏnagora gīrĕm̐ badi mohamuna keruvārĕ
vanida baluvunido vāvādamem̐ṭige

(||sĕṭṭa||)
sesa dalamīm̐da mom̐sĕ sigguliṁkā nem̐ṭige
posariṁchi vorisidem̐ būve piṁdĕ
āsala śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi ninnum̐ gūḍĕ
pāsigūḍebadidoḍam̐ baṁtamāḍanem̐ṭige