Sesinave semta limkam jelamgare mee riddaru

సేసినవె చేఁత లిఁకఁ జెలఁగరే మీ రిద్దరు
Language

(॥పల్లవి॥)
సేసినవె చేఁత లిఁకఁ జెలఁగరే మీ రిద్దరు
మోసపో వీవలపులు ముయికి ముయౌను

(॥సేసీ॥)
యీడు జోడై పెనఁగితి నింతులకుఁ బతులకు
వేడు కెంత గలిగినా వేసటగాదు
పాడి పంతా లొక్కపై పరగినవారికి
చూడఁ జూడఁ జేకొన్నదే చుట్టరిక మగునే

(॥సేసీ॥)
చిగిరింపుఁ జిత్తములఁ జెనకేటివారికి
తగిలి యెంత గూడినాఁ దనివిలేదు
పగటునఁ బొందుగల్గి పాయకున్నవారికి
నగితే నెదురుబడి నాములెక్కును

(॥సేసీ॥)
బత్తితోడ నే పొద్దూఁ బాయకుండి వారికి
చిత్తా లెంత గరఁగినా సిగ్గు వుట్టదు
హత్తి శ్రీవేంకటేశుఁడు అలమేల్మంగ నిన్నేలె
పొత్తుల రతులు మీకుఁ బోరచులౌను

(||pallavi||)
sesinavĕ sem̐ta lim̐kam̐ jĕlam̐gare mī riddaru
mosabo vīvalabulu muyigi muyaunu

(||sesī||)
yīḍu joḍai pĕnam̐gidi niṁtulagum̐ badulagu
veḍu kĕṁta galiginā vesaḍagādu
pāḍi paṁtā lŏkkabai paraginavārigi
sūḍam̐ jūḍam̐ jegŏnnade suṭṭariga magune

(||sesī||)
sigiriṁpum̐ jittamulam̐ jĕnageḍivārigi
tagili yĕṁta gūḍinām̐ daniviledu
pagaḍunam̐ bŏṁdugalgi pāyagunnavārigi
nagide nĕdurubaḍi nāmulĕkkunu

(||sesī||)
battidoḍa ne pŏddūm̐ bāyaguṁḍi vārigi
sittā lĕṁta garam̐ginā siggu vuṭṭadu
hatti śhrīveṁkaḍeśhum̐ḍu alamelmaṁga ninnelĕ
pŏttula radulu mīgum̐ borasulaunu