Sesinattallaa meegum jellumgaaga

చేసినట్టల్లా మీకుఁ జెల్లుఁగాక
Language

(॥పల్లవి॥)
చేసినట్టల్లా మీకుఁ జెల్లుఁగాక
బాస చేసుకొన్న మిమ్ముఁ బచారించఁగలమా

(॥చేసి॥)
బలిమికాఁడవు నీవు పట్టపుదేవు లాపె
యెలమి సాకిరులు నే మెట్టుచెప్పేము
వలపెల్లా నీ సొమ్ము వాసులెల్లా నింతిపాలు
కలిగినట్లనే తగవు దిద్దవసమా

(॥చేసి॥)
చక్కని జాణవు నీవు వదురులాఁడి యాపె
పక్కన మిమ్మెట్టు వొడఁబరచేము
యిక్కువ లెఱుఁగుదువు యియ్యకొనెనాపె తొల్లె
యెక్కువ తక్కువ లేక యిచ్చలాడ నోపేమా

(॥చేసి॥)
శ్రీ వేంకటేశుఁడవు చెలియ భావజు తల్లి
చేవదేర నే మెట్టు సిగ్గు వాపేము
కైవశ మాపెకు నీవు కాదన దాకె నీమాట
వేవేలకుఁ గూడితిరి వినుతించఁదరమా

(||pallavi||)
sesinaṭṭallā mīgum̐ jĕllum̐gāga
bāsa sesugŏnna mimmum̐ basāriṁcham̐galamā

(||sesi||)
balimigām̐ḍavu nīvu paṭṭabudevu lābĕ
yĕlami sāgirulu ne mĕṭṭusĕppemu
valabĕllā nī sŏmmu vāsulĕllā niṁtibālu
kaliginaṭlane tagavu diddavasamā

(||sesi||)
sakkani jāṇavu nīvu vadurulām̐ḍi yābĕ
pakkana mimmĕṭṭu vŏḍam̐barasemu
yikkuva lĕṟum̐guduvu yiyyagŏnĕnābĕ tŏllĕ
yĕkkuva takkuva lega yichchalāḍa nobemā

(||sesi||)
śhrī veṁkaḍeśhum̐ḍavu sĕliya bhāvaju talli
sevadera ne mĕṭṭu siggu vābemu
kaivaśha mābĕgu nīvu kādana dāgĕ nīmāḍa
vevelagum̐ gūḍidiri vinudiṁcham̐daramā