Sesinamtam jellum boraa sedigi ne lonaidi

చేసినంతఁ జెల్లుఁ బోరా చేతికి నే లోనైతి
Language

(॥పల్లవి॥)
చేసినంతఁ జెల్లుఁ బోరా చేతికి నే లోనైతి
రాసికెక్కినంతమీఁద రంతులు వంతులునే

(॥చేసి॥)
కోరి దవ్వులఁ జూచితే కొండలెల్ల నున్నవే
చేరువైతే చెట్లూనుఁ జేమలింతే
పోరచివోరమణుఁడ పొందుదాఁక మినయాలె
తారుకాణ లటమీఁదఁ దాఁటలుఁదూఁటలుసే

(॥చేసి॥)
మక్కువఁజూచిన నెండమావులెల్లఁ జెరువులే
నిక్కము వెదకఁబోతే నేల మిన్నే
చక్కఁగా మాటాడుదాఁక చల్లనివే నీ గుణాలు
వొక్కటైన మీఁద మరి వొలసీనొల్లములే

(॥చేసి॥)
కడఁజూడ జలధికి కల్లలు బుల్లలునే
నడుమ నాఁడిముత్యాలు నవరత్నాలే
యెడయఁగా శ్రీ వేంకటేశ నిన్ను నంటిఁగాని
బడి నన్నుఁ గూడితివి బాగులు లాగులునే

(||pallavi||)
sesinaṁtam̐ jĕllum̐ borā sedigi ne lonaidi
rāsigĕkkinaṁtamīm̐da raṁtulu vaṁtulune

(||sesi||)
kori davvulam̐ jūside kŏṁḍalĕlla nunnave
seruvaide sĕṭlūnum̐ jemaliṁte
porasivoramaṇum̐ḍa pŏṁdudām̐ka minayālĕ
tārugāṇa laḍamīm̐dam̐ dām̐ṭalum̐dūm̐ṭaluse

(||sesi||)
makkuvam̐jūsina nĕṁḍamāvulĕllam̐ jĕruvule
nikkamu vĕdagam̐bode nela minne
sakkam̐gā māḍāḍudām̐ka sallanive nī guṇālu
vŏkkaḍaina mīm̐da mari vŏlasīnŏllamule

(||sesi||)
kaḍam̐jūḍa jaladhigi kallalu bullalune
naḍuma nām̐ḍimutyālu navaratnāle
yĕḍayam̐gā śhrī veṁkaḍeśha ninnu naṁṭim̐gāni
baḍi nannum̐ gūḍidivi bāgulu lāgulune