సేసిన చేఁతులు చెల్లె చెప్పిన మాఁటలు వింటి
(॥పల్లవి॥)
సేసిన చేఁతులు చెల్లె చెప్పిన మాఁటలు వింటి
రాసికెక్కె నీ సుద్దులు రక్షించు మమ్మును
(॥సేసి॥)
చిగురుమోవి వంచి సిగ్గువడ నేమిటికి
మొగమెత్తి చూడవయ్యా మోక్కే నీకు
అగుడునిట్టూరుపులు అడఁచుకొనఁదగదు
నగవయ్యా వొకమాటు నాతో నీవు
(॥సేసి॥)
కొప్పు జారినందుకుఁగాఁ గొంచించ నేమిటికి
చెప్పవయ్యా యేమాఁటైనా జేరి వినేను
తొప్పఁదోఁగే చెమటలు తుడుచుకోనంతయాల
అప్పుడే విసరేఁగాని అండకు రావయ్యా
(॥సేసి॥)
కందువైన వాసనలు కప్పిపెట్ట నేమిటికి
ఇందవయ్యా జవాది ఇచ్చే నేను
ఇందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
చెంది యొక్కమనసుతోఁ జెలరేఁగు మిఁకను
(||pallavi||)
sesina sem̐tulu sĕllĕ sĕppina mām̐ṭalu viṁṭi
rāsigĕkkĕ nī suddulu rakṣhiṁchu mammunu
(||sesi||)
sigurumovi vaṁchi sigguvaḍa nemiḍigi
mŏgamĕtti sūḍavayyā mokke nīgu
aguḍuniṭṭūrubulu aḍam̐sugŏnam̐dagadu
nagavayyā vŏgamāḍu nādo nīvu
(||sesi||)
kŏppu jārinaṁdugum̐gām̐ gŏṁchiṁcha nemiḍigi
sĕppavayyā yemām̐ṭainā jeri vinenu
tŏppam̐dom̐ge sĕmaḍalu tuḍusugonaṁtayāla
appuḍe visarem̐gāni aṁḍagu rāvayyā
(||sesi||)
kaṁduvaina vāsanalu kappibĕṭṭa nemiḍigi
iṁdavayyā javādi ichche nenu
iṁdarilo śhrīveṁkaḍeśha nannu nelidivi
sĕṁdi yŏkkamanasudom̐ jĕlarem̐gu mim̐kanu