Sesidi nippade nenu seyamgala vinnabaalu

సేసితి నిప్పడే నేను సేయఁగల విన్నపాలు
Language

(॥పల్లవి॥)
సేసితి నిప్పడే నేను సేయఁగల విన్నపాలు
లాసి లాసియం(యెం?)తేసి వలపు చల్లీఁ దాను

(॥సేసి॥)
చుట్టరికము దగిలి సుద్దు లేమి చెప్పీనే
పట్టి చూడనేలే చెక్కు పాలుగారీని
పెట్టకు మనవె యాన పిందెలు దిగేపొద్దు
నెట్టుకొన్న దొర తాను నే బాఁతే తనకు

(॥సేసి॥)
నారుకొనీఁ బులకలు నవ్వు లేమి నవ్వీనే
సారె నంటనేలే కొప్ప మూరెడయ్యీని
గోర గీరవద్దనవే యేరులువారే కాలము
నేరుపరి తా నిన్నిటా నే బాఁతే తనకు

(॥సేసి॥)
వుమ్మగిలీఁ దమకము వొరసి యేమి చూచీనే
దొమ్మిఁ జన్నులంటనేలే తుదకెక్కీని
నమ్మి కిమ్మనుమనవే ననిచి కూడేవేళ
నెమ్మి శ్రీవేంకటేశుఁడు బాఁతే తనకు

(||pallavi||)
sesidi nippaḍe nenu seyam̐gala vinnabālu
lāsi lāsiyaṁ(yĕṁ?)tesi valabu sallīm̐ dānu

(||sesi||)
suṭṭarigamu dagili suddu lemi sĕppīne
paṭṭi sūḍanele sĕkku pālugārīni
pĕṭṭagu manavĕ yāna piṁdĕlu digebŏddu
nĕṭṭugŏnna dŏra tānu ne bām̐te tanagu

(||sesi||)
nārugŏnīm̐ bulagalu navvu lemi navvīne
sārĕ naṁṭanele kŏppa mūrĕḍayyīni
gora gīravaddanave yeruluvāre kālamu
nerubari tā ninniḍā ne bām̐te tanagu

(||sesi||)
vummagilīm̐ damagamu vŏrasi yemi sūsīne
dŏmmim̐ jannulaṁṭanele tudagĕkkīni
nammi kimmanumanave nanisi kūḍeveḽa
nĕmmi śhrīveṁkaḍeśhum̐ḍu bām̐te tanagu