సేసే వుపచారా లేవి చెప్పవయ్యా
(॥పల్లవి॥)
సేసే వుపచారా లేవి చెప్పవయ్యా
వేసాలేల సేసేవు వేఁడుకొనే నిన్నును
(॥సేసే॥)
వింతవింతమాటలే వేగినంతా నాడితిరి
బంతి విడెములు సేసి పరగితిరి
కొంతదడ వూరకే గుట్టుతోడ నుంటిరి
యెంతేసిబడలితివో యెఱఁగము నేము
(॥సేసే॥)
నడుమనడుమ మీరు నవ్వుకొంటా నుంటిరి
బడినే సుతిగూడుక పాడుకొంటిరి
నిడివిగాఁ బంతాలతో నెత్తమాడుతా నుంటిరి
అడరి నీవోరుప దెలియదు మాకు నిపుడు
(॥సేసే॥)
వొప్పుగ నుయ్యాలమీఁద నూఁగుకొంటా నుంటిరి
కప్పుకొంటివి రెంటెము గళబెళను
యిప్పుడు శ్రీవేంకటే: యేలితివి నన్ను నీడ
దప్పిగొనువుగదా నీతలఁ పడిగేను
(||pallavi||)
sese vubasārā levi sĕppavayyā
vesālela sesevu vem̐ḍugŏne ninnunu
(||sese||)
viṁtaviṁtamāḍale veginaṁtā nāḍidiri
baṁti viḍĕmulu sesi paragidiri
kŏṁtadaḍa vūrage guṭṭudoḍa nuṁṭiri
yĕṁtesibaḍalidivo yĕṟam̐gamu nemu
(||sese||)
naḍumanaḍuma mīru navvugŏṁṭā nuṁṭiri
baḍine sudigūḍuga pāḍugŏṁṭiri
niḍivigām̐ baṁtālado nĕttamāḍudā nuṁṭiri
aḍari nīvoruba dĕliyadu māgu nibuḍu
(||sese||)
vŏppuga nuyyālamīm̐da nūm̐gugŏṁṭā nuṁṭiri
kappugŏṁṭivi rĕṁṭĕmu gaḽabĕḽanu
yippuḍu śhrīveṁkaḍe: yelidivi nannu nīḍa
dappigŏnuvugadā nīdalam̐ paḍigenu