సేసవెట్టి పెండ్లాడి సిగ్గులు వడితేఁ బోదు
(॥పల్లవి॥)
సేసవెట్టి పెండ్లాడి సిగ్గులు వడితేఁ బోదు
బాస యిచ్చి నీకితఁడు బత్తి సేసీని
(॥సేస॥)
మనసిచ్చి యాతనితో మాఁటలాడఁగదవే
వినయాన ని న్నతఁడు వేఁడుకొనీని
పెనఁగక ప్రియములే పెంచి పెంచి చూపవే
మునుకొని చుట్టరికములే సేసీని
(॥సేస॥)
వేడుకతో నీమోవి విందు లిట్టె పెట్టవే
వోడక నీతోపొందు లొనరించీని
జాడతోడ వీనులారా సమ్మతించి వినవే
వాడికెతో మేనబావ వావులు చెప్పీని
(॥సేస॥)
యింటలో నీబలమెల్లా నితనికిఁ జూపవే
జంటయై నీకాఁ(కాఁగా?) టిలో సాముసేసీని
నంటు శ్రీవేంకటేశుఁ డున్నతిఁ గూడె మెచ్చవే
పెంటలైన రతులను పెచ్చు వెరిగీని
(||pallavi||)
sesavĕṭṭi pĕṁḍlāḍi siggulu vaḍidem̐ bodu
bāsa yichchi nīgidam̐ḍu batti sesīni
(||sesa||)
manasichchi yādanido mām̐ṭalāḍam̐gadave
vinayāna ni nnadam̐ḍu vem̐ḍugŏnīni
pĕnam̐gaga priyamule pĕṁchi pĕṁchi sūbave
munugŏni suṭṭarigamule sesīni
(||sesa||)
veḍugado nīmovi viṁdu liṭṭĕ pĕṭṭave
voḍaga nīdobŏṁdu lŏnariṁchīni
jāḍadoḍa vīnulārā sammadiṁchi vinave
vāḍigĕdo menabāva vāvulu sĕppīni
(||sesa||)
yiṁṭalo nībalamĕllā nidanigim̐ jūbave
jaṁṭayai nīgām̐(kām̐gā?) ṭilo sāmusesīni
naṁṭu śhrīveṁkaḍeśhum̐ ḍunnadim̐ gūḍĕ mĕchchave
pĕṁṭalaina radulanu pĕchchu vĕrigīni