Sesavetti naabe yemisesinaam jellu

సేసవెట్టి నాపె యేమిసేసినాఁ జెల్లు
Language

(॥పల్లవి॥)
సేసవెట్టి నాపె యేమిసేసినాఁ జెల్లు
రాసికెక్కె నీ సుద్దులు రావయ్య యింటికి

(॥సేస॥)
తమకించి పైకొంటేఁ దప్పులు వెదకరాదు
సముకానఁ గొసరితే జరయరాదు
నెమకి గోరనూఁదితే నేరము లెంచఁగరాదు
ప్రమదానఁ జే చాఁచితే పంతమాడరాదు

(॥సేస॥)
సొలసి కొంగువట్టితే సూడుకు దగులరాదు
తిలకించి చూచితేను దీఁకొనరాదు
వలచి తిట్టుదిట్టితే వానికిఁ బెనఁగరాదు
కలయుచు నవ్వితేను కాఁతాళించరాదు

(॥సేస॥)
రతుల నలఇంచితే రాఁపులు సేయఁగరాదు
సతమై పంగించితేను సాదించరాదు
ఇతవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
అతివ లేమనినాను అవుఁగా దనరాదు

(||pallavi||)
sesavĕṭṭi nābĕ yemisesinām̐ jĕllu
rāsigĕkkĕ nī suddulu rāvayya yiṁṭigi

(||sesa||)
tamagiṁchi paigŏṁṭem̐ dappulu vĕdagarādu
samugānam̐ gŏsaride jarayarādu
nĕmagi goranūm̐dide neramu lĕṁcham̐garādu
pramadānam̐ je sām̐side paṁtamāḍarādu

(||sesa||)
sŏlasi kŏṁguvaṭṭide sūḍugu dagularādu
tilagiṁchi sūsidenu dīm̐kŏnarādu
valasi tiṭṭudiṭṭide vānigim̐ bĕnam̐garādu
kalayusu navvidenu kām̐tāḽiṁcharādu

(||sesa||)
radula nala̮iṁchide rām̐pulu seyam̐garādu
sadamai paṁgiṁchidenu sādiṁcharādu
idavai śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
adiva lemaninānu avum̐gā danarādu