సేసవెట్టెను విభుఁడు సిగ్గులిఁక నేమిటికి
(॥పల్లవి॥)
సేసవెట్టెను విభుఁడు సిగ్గులిఁక నేమిటికి
ఆసలాసల నోలలాడుచున్నాఁడు
(॥సేస॥)
పలుకఁగదె జవరాల పతితోడ నెదిరించి
చిలుకఁగదె చిరునవ్వు సెలవి నిండ
కులుకఁగదె నీ సొలపు కొసరుఁజూపులఁజూచి
కలయికకు నీవద్దఁ గాచుకున్నాఁడు
(॥సేస॥)
ఆడఁగదే వొకమాట ఆయములు గరఁగఁగ
పాడఁగదె నీయెలుఁగు పస దొలంక
కూడఁగదె సమరతుల గుచ్చి నీకాఁగిటను
వాడికల నీకుఁ గడు వలచివున్నాఁడు
(॥సేస॥)
కురియఁగదె ముద్దు లిటు కొదలేని కొరికల
మురియఁగదె మేనఁగలమురిపంబులు
యిరవై శ్రీవెంకటేశుఁ డిటు నిను నేలె
మరిగి నీమచ్చికల మలయుచున్నాఁడు
(||pallavi||)
sesavĕṭṭĕnu vibhum̐ḍu siggulim̐ka nemiḍigi
āsalāsala nolalāḍusunnām̐ḍu
(||sesa||)
palugam̐gadĕ javarāla padidoḍa nĕdiriṁchi
silugam̐gadĕ sirunavvu sĕlavi niṁḍa
kulugam̐gadĕ nī sŏlabu kŏsarum̐jūbulam̐jūsi
kalayigagu nīvaddam̐ gāsugunnām̐ḍu
(||sesa||)
āḍam̐gade vŏgamāḍa āyamulu garam̐gam̐ga
pāḍam̐gadĕ nīyĕlum̐gu pasa dŏlaṁka
kūḍam̐gadĕ samaradula guchchi nīgām̐giḍanu
vāḍigala nīgum̐ gaḍu valasivunnām̐ḍu
(||sesa||)
kuriyam̐gadĕ muddu liḍu kŏdaleni kŏrigala
muriyam̐gadĕ menam̐galamuribaṁbulu
yiravai śhrīvĕṁkaḍeśhum̐ ḍiḍu ninu nelĕ
marigi nīmachchigala malayusunnām̐ḍu