Sesannage vachchi vaanim jettavatti tiyyanela

చేసన్నకే వచ్చి వానిఁ జెట్టవట్టి తియ్యనేల
Language

(॥పల్లవి॥)
చేసన్నకే వచ్చి వానిఁ జెట్టవట్టి తియ్యనేల
బాసయిచ్చి నన్ను నేలెఁ బదరకురే

(॥చేస॥)
మక్కువసేసినవాఁడు మన్నించనేరఁడా
కక్కసించి పతినేల కాకు సే సేవే
నిక్కమాతని మనసు నేనే యెఱుఁగుదును
మొక్కేఁగాక మీరేల మోవనాడేరే

(॥చేస॥)
కన్నులఁ జూచినవాఁడు కరుణించనేరఁడా
సన్నల నాతనినేల సాదించేరే
తన్నుఁదానె వచ్చీఁగాక తగవు దప్పఁ డతఁడు
పన్ని నేనే వేఁడుకొనే పైకొని దూరకురే

(॥చేస॥)
కదియవచ్చినవాఁడు కాఁగిలించ నేరఁడా
యెదుట నున్నవాని నే మెగ్గు లెంచేరే
యిదివో శ్రీ వేంకటేశుఁ డింతలోనె నన్నుఁగూడె
వదలక సేవ సేసే వాసిఁ బెనఁగకురే

(||pallavi||)
sesannage vachchi vānim̐ jĕṭṭavaṭṭi tiyyanela
bāsayichchi nannu nelĕm̐ badaragure

(||sesa||)
makkuvasesinavām̐ḍu manniṁchaneram̐ḍā
kakkasiṁchi padinela kāgu se seve
nikkamādani manasu nene yĕṟum̐gudunu
mŏkkem̐gāga mīrela movanāḍere

(||sesa||)
kannulam̐ jūsinavām̐ḍu karuṇiṁchaneram̐ḍā
sannala nādaninela sādiṁchere
tannum̐dānĕ vachchīm̐gāga tagavu dappam̐ ḍadam̐ḍu
panni nene vem̐ḍugŏne paigŏni dūragure

(||sesa||)
kadiyavachchinavām̐ḍu kām̐giliṁcha neram̐ḍā
yĕduḍa nunnavāni ne mĕggu lĕṁchere
yidivo śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐gūḍĕ
vadalaga seva sese vāsim̐ bĕnam̐gagure