Sesabaalavaaramu sellubadi gala???

సేసపాలవారము చెల్లుబడి గల???
Language

(॥పల్లవి॥)
సేసపాలవారము చెల్లుబడి గల???
తాసువలె రతుల కిద్దరము నున్నారము

(॥సేస॥)
మఱవదు మనసు మరి నీవాడిన మాట
గుఱుతై మనసులో గుబ్బతిలీని
మఱి తెరమఱఁగైతే మంచివయ్యా నన్నియును
తఱియైన పనొ(న?) ల కిద్దరము నున్నారము

(॥సేస॥)
సాయదు నెఁ(నెం?) జెరివి పంతపు నిచేఁతలకు
చేయంటినజిడ్డులై చిమ్మిరేఁచీని
మూయికి మూయున్న దింతే మూసిదాఁచితి నీకు
దాయిదండై వేడుక కిద్దరము నున్నారము

(॥సేస॥)
విడువదు అసా విఁ(విం?) త నీకూటములకు
వుడివోపవలపులై వుమ్మగిలీని
చెడనిమేలైన దింతె శ్రీవేంకటేశ యెప్పుడు
తడయని మొక్కుల కిద్దరము నున్నారము

(||pallavi||)
sesabālavāramu sĕllubaḍi gala???
tāsuvalĕ radula kiddaramu nunnāramu

(||sesa||)
maṟavadu manasu mari nīvāḍina māḍa
guṟudai manasulo gubbadilīni
maṟi tĕramaṟam̐gaide maṁchivayyā nanniyunu
taṟiyaina panŏ(na?) la kiddaramu nunnāramu

(||sesa||)
sāyadu nĕm̐(nĕṁ?) jĕrivi paṁtabu nisem̐talagu
seyaṁṭinajiḍḍulai simmirem̐sīni
mūyigi mūyunna diṁte mūsidām̐sidi nīgu
dāyidaṁḍai veḍuga kiddaramu nunnāramu

(||sesa||)
viḍuvadu asā vim̐(viṁ?) ta nīgūḍamulagu
vuḍivobavalabulai vummagilīni
sĕḍanimelaina diṁtĕ śhrīveṁkaḍeśha yĕppuḍu
taḍayani mŏkkula kiddaramu nunnāramu