చేరి యాతనికి బుద్దిచెప్పవద్దా నీవే తొల్లి
(॥పల్లవి॥)
చేరి యాతనికి బుద్దిచెప్పవద్దా నీవే తొల్లి
నేరుపుతో నీతగవు నీవెఱఁగవటవే
(॥చేరి॥)
గామిడిమాటలాడఁగాఁ గడఁగి తిట్టితిఁగాక
యేమంటినే నీమగని నింతిరో నేఁడు
గోమునఁ జెనకరాఁగా గోరగిరితిఁగాక
చేముట్టి యేమైనానుఁ జేసితివటే
(॥చేరి॥)
కొంగువట్టితియ్యఁగా గుబ్బల నొత్తితిఁగాక
వెఁగలినీపతి దడవితినటవే
సంగాతాలు సేయరాఁగా సారెకు నవ్వితిఁగాక
పంగించి యాతని నేఁ దప్పకచూచితినటే
(॥చేరి॥)
వావి చెప్పఁగాఁ గాఁగిట వడి బిగించితిఁగాక
శ్రీవేంకటేశ్వరుం బిలిచితినటవే
కైవసమై మోవియ్యఁగా గంటిచేసితిఁగాక
యీవల నీతనిపొందు లెఱుఁగుదునటవే
(||pallavi||)
seri yādanigi buddisĕppavaddā nīve tŏlli
nerubudo nīdagavu nīvĕṟam̐gavaḍave
(||seri||)
gāmiḍimāḍalāḍam̐gām̐ gaḍam̐gi tiṭṭidim̐gāga
yemaṁṭine nīmagani niṁtiro nem̐ḍu
gomunam̐ jĕnagarām̐gā goragiridim̐gāga
semuṭṭi yemainānum̐ jesidivaḍe
(||seri||)
kŏṁguvaṭṭidiyyam̐gā gubbala nŏttidim̐gāga
vĕm̐galinībadi daḍavidinaḍave
saṁgādālu seyarām̐gā sārĕgu navvidim̐gāga
paṁgiṁchi yādani nem̐ dappagasūsidinaḍe
(||seri||)
vāvi sĕppam̐gām̐ gām̐giḍa vaḍi bigiṁchidim̐gāga
śhrīveṁkaḍeśhvaruṁ bilisidinaḍave
kaivasamai moviyyam̐gā gaṁṭisesidim̐gāga
yīvala nīdanibŏṁdu lĕṟum̐gudunaḍave