చేరి నన్నుఁ జూచి యేల సిగ్గుపడేవు
(॥పల్లవి॥)
చేరి నన్నుఁ జూచి యేల సిగ్గుపడేవు
గారవిం చందుకోవయ్యా కప్పురమిచ్చీని
(॥॥)
ముదిత, చన్నుదోయి మొనలు నిన్నుసోఁకఁగా
చెదరిననీనెరుల చిక్కుదీసిని
పెదవులపై తమ్మబేంట్లు రాలఁ గాను
కదసి నీకప్పటి నీకత చెప్పీని
(॥॥)
పొంచి తనకొప్పులోనిపూవులు నీపై రాలఁ గా
కుంచెవేసి నిలుచుండి కొలిచీ నిన్ను
కంచు వాఁగినట్టు పైఁడిగాజులు రవళించఁ గా
మంచముపైఁ బాదాలొత్తి మనసు మెప్పించీని
(॥॥)
పొదిగి బాహులతలె పూవులదండలు గాఁగ
కదిసి నీపై వేసి కాఁగిలించీని
యెదుట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీ-
పెదవితేనెల కాపె పెనఁ గీ నీతోను
(||pallavi||)
seri nannum̐ jūsi yela siggubaḍevu
gāraviṁ saṁdugovayyā kappuramichchīni
(||||)
mudida, sannudoyi mŏnalu ninnusom̐kam̐gā
sĕdarinanīnĕrula sikkudīsini
pĕdavulabai tammabeṁṭlu rālam̐ gānu
kadasi nīgappaḍi nīgada sĕppīni
(||||)
pŏṁchi tanagŏppulonibūvulu nībai rālam̐ gā
kuṁchĕvesi nilusuṁḍi kŏlisī ninnu
kaṁchu vām̐ginaṭṭu paim̐ḍigājulu ravaḽiṁcham̐ gā
maṁchamubaim̐ bādālŏtti manasu mĕppiṁchīni
(||||)
pŏdigi bāhuladalĕ pūvuladaṁḍalu gām̐ga
kadisi nībai vesi kām̐giliṁchīni
yĕduḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nī-
pĕdavidenĕla kābĕ pĕnam̐ gī nīdonu