చెఱకు దీపంటా నేమిసేయవచ్చునే
(॥పల్లవి॥)
చెఱకు దీపంటా నేమిసేయవచ్చునే
మఱి మరి విభునితో మారుకు మారే కాక
(॥చెఱ॥)
మనవి వినీనంటా మాపుదాఁకాఁ జెప్పుదురా
చనవు గలదంటాను సాదింతురా
చెనకనేరుతునంటా చేతిగోరు దాఁకింతురా
యెనసే మగవానితో నెంత కెం(కం)తే గాక
(॥చెఱ॥)
సరసమాడేనంటా సారెకుఁ బెనఁ గుదురా
ఇరవైనదాననంటా నెలఇంతురా
తరితీపు సే సేనంటా దండకు రాకుండుదురా
మరిగినమగనితో మట్టుకుమట్టే కాక
(॥చెఱ॥)
కూరిమిగలదంటాను కొసరి పైకొందురా
గారవించెనంటాను కక్కసింతురా
యీరీతి శ్రీ వేంకటేశుఁ డిప్పు డిట్టె నిన్నుఁగూడె
కోరి యేలినవానితో మేరకు మేరే కాక
(||pallavi||)
sĕṟagu dībaṁṭā nemiseyavachchune
maṟi mari vibhunido mārugu māre kāga
(||sĕṟa||)
manavi vinīnaṁṭā mābudām̐kām̐ jĕppudurā
sanavu galadaṁṭānu sādiṁturā
sĕnaganerudunaṁṭā sedigoru dām̐kiṁturā
yĕnase magavānido nĕṁta kĕṁ(kaṁ)te gāga
(||sĕṟa||)
sarasamāḍenaṁṭā sārĕgum̐ bĕnam̐ gudurā
iravainadānanaṁṭā nĕla̮iṁturā
taridību se senaṁṭā daṁḍagu rāguṁḍudurā
mariginamaganido maṭṭugumaṭṭe kāga
(||sĕṟa||)
kūrimigaladaṁṭānu kŏsari paigŏṁdurā
gāraviṁchĕnaṁṭānu kakkasiṁturā
yīrīdi śhrī veṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ ninnum̐gūḍĕ
kori yelinavānido meragu mere kāga