చెప్పినట్టే సేతుఁగాక చేరి నీకు
(॥పల్లవి॥)
చెప్పినట్టే సేతుఁగాక చేరి నీకు
తప్పులుఁ దారులు నెంచ తగవేదీ
(॥చెప్పి॥)
నిన్నుఁ జూచి నవ్వు వచ్చె నీమీఁది కోపము దీరె
అన్నిటా దొడ్డవాఁడవు ఆనలేల
కన్నుల నిన్ను గంటిమి కాయమెల్లాఁ జల్లనాయ
పన్నేటి మాయల కిఁకఁ బనియేది
(॥చెప్పి॥)
మాఁట నీకుఁగా వెళ్లె మంకులెల్లఁ బెడఁబాసె
చాటువ గెలిచితిమి సాకిరులేల
నేఁటనే తప్పదిఁకను నీకు నేను వున్నారము
వాఁటాలు సేయఁగ నీవల్లనేది
(॥చెప్పి॥)
కొనగోరు నిన్ను సోఁకె కూటము లందె కలిగె
పనిమంతుఁడవు వొడఁబాటులేల
ఘనుఁడ శ్రీ వేంకటేశ కలసితి మిప్పుడిట్టె
చనవు చేకొనుచోట సాదించ నేది
(||pallavi||)
sĕppinaṭṭe sedum̐gāga seri nīgu
tappulum̐ dārulu nĕṁcha tagavedī
(||sĕppi||)
ninnum̐ jūsi navvu vachchĕ nīmīm̐di kobamu dīrĕ
anniḍā dŏḍḍavām̐ḍavu ānalela
kannula ninnu gaṁṭimi kāyamĕllām̐ jallanāya
panneḍi māyala kim̐kam̐ baniyedi
(||sĕppi||)
mām̐ṭa nīgum̐gā vĕḽlĕ maṁkulĕllam̐ bĕḍam̐bāsĕ
sāḍuva gĕlisidimi sāgirulela
nem̐ṭane tappadim̐kanu nīgu nenu vunnāramu
vām̐ṭālu seyam̐ga nīvallanedi
(||sĕppi||)
kŏnagoru ninnu som̐kĕ kūḍamu laṁdĕ kaligĕ
panimaṁtum̐ḍavu vŏḍam̐bāḍulela
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kalasidi mippuḍiṭṭĕ
sanavu segŏnusoḍa sādiṁcha nedi