Seppina ttiddaramunum jesemayyaa

చెప్పిన ట్టిద్దరమునుఁ జేసేమయ్యా
Language

(॥పల్లవి॥)
చెప్పిన ట్టిద్దరమునుఁ జేసేమయ్యా
ఇప్పుడు గాఁగిలించే మియ్యకొంటిమయ్యా

(॥చెప్పి॥)
వరుసఇచ్చేవాఁడవు వాదు మాన్పనేరవా
వెరసి యిద్దరిమాట వినవయ్యా
తెరలోనున్నవాఁడవు తెలియదా నీకిన్నియు
అరసి వెనకముందు లడుగనేలయ్యా

(॥చెప్పి॥)
తగవు దిద్దేవాఁడవు తప్పు దీర్చనేరవా
సొగసి నేమున్న జాడ చూడవయ్యా
నగినవాఁడవు నీవే నయములు నేరిపేమా
మొగమిచ్చలను నీవే మొక్కించవయ్యా

(॥చెప్పి॥)
ఇద్దరిఁ గూడినవాఁడ వెక్కుడు సేయనేరవా
చద్దికి వేఁడికి మోవి చవిగోవయ్య
గద్దరిశ్రీవేంకటేశ కలిగితివి మాపాల
పొద్దువొద్దున నిట్టె భోదించవయ్యా

(||pallavi||)
sĕppina ṭṭiddaramunum̐ jesemayyā
ippuḍu gām̐giliṁche miyyagŏṁṭimayyā

(||sĕppi||)
varusa̮ichchevām̐ḍavu vādu mānpaneravā
vĕrasi yiddarimāḍa vinavayyā
tĕralonunnavām̐ḍavu tĕliyadā nīginniyu
arasi vĕnagamuṁdu laḍuganelayyā

(||sĕppi||)
tagavu diddevām̐ḍavu tappu dīrsaneravā
sŏgasi nemunna jāḍa sūḍavayyā
naginavām̐ḍavu nīve nayamulu neribemā
mŏgamichchalanu nīve mŏkkiṁchavayyā

(||sĕppi||)
iddarim̐ gūḍinavām̐ḍa vĕkkuḍu seyaneravā
saddigi vem̐ḍigi movi savigovayya
gaddariśhrīveṁkaḍeśha kaligidivi mābāla
pŏdduvŏdduna niṭṭĕ bhodiṁchavayyā