చెప్పితి నిప్పుడే నే నాచి త్తములోఁ గలమాట
(॥పల్లవి॥)
చెప్పితి నిప్పుడే నే నాచి త్తములోఁ గలమాట
యెప్పు డేడ మాటలాడే దిది మేలు సుమ్మీ
(॥చెప్పి॥)
మనసులో కోపమెల్లా మఱచేనంటే నాకుఁ
దనమేవిగుఱుతులు తలఁపించీనే
తనుఁదానే విచ్చేసినాఁ దలవంచుకొందుఁ జేతు
యెనలేక ఇందుకు సిగ్గువట్టీఁ జుమ్మీ
(॥చెప్పి॥)
మొదలితనవోజలు మూసిదాఁచేనంటేను
యెదిరి తనమైకాఁక లెత్తి పెట్టీనే
కదిసి తాఁ గూచుండినాఁ గడ వేరేమంచముపై
నిదిరింతుఁ జేతు నది నేరమెంచీఁ జుమ్మీ
(॥చెప్పి॥)
గోలనై తనతిట్లు గుట్టుసేసుకొనేనంటే
నాలితనమొక్కు చూచి నవ్వువచ్చీనే
యీలీల శ్రీవేంకటేశుఁ డింతలో విచ్చేసికూడె
పాలుపడి మెత్తుఁ జేతు పంతమాడీఁ జుమ్మీ
(||pallavi||)
sĕppidi nippuḍe ne nāsi ttamulom̐ galamāḍa
yĕppu ḍeḍa māḍalāḍe didi melu summī
(||sĕppi||)
manasulo kobamĕllā maṟasenaṁṭe nāgum̐
danameviguṟudulu talam̐piṁchīne
tanum̐dāne vichchesinām̐ dalavaṁchugŏṁdum̐ jedu
yĕnalega iṁdugu sigguvaṭṭīm̐ jummī
(||sĕppi||)
mŏdalidanavojalu mūsidām̐senaṁṭenu
yĕdiri tanamaigām̐ka lĕtti pĕṭṭīne
kadisi tām̐ gūsuṁḍinām̐ gaḍa veremaṁchamubai
nidiriṁtum̐ jedu nadi neramĕṁchīm̐ jummī
(||sĕppi||)
golanai tanadiṭlu guṭṭusesugŏnenaṁṭe
nālidanamŏkku sūsi navvuvachchīne
yīlīla śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo vichchesigūḍĕ
pālubaḍi mĕttum̐ jedu paṁtamāḍīm̐ jummī