చెప్పిపంప నింత యేలే చెలులచే సారెసారె
(॥పల్లవి॥)
చెప్పిపంప నింత యేలే చెలులచే సారెసారె
యెప్పుడును తనబుద్ది కెదురాడలేనే
(॥చెప॥)
తనతో నేఁ గోపగించి తనదిక్కు చూడకున్న
సునిసి తా నున్న మేడ చూడకుండలేనే
మనసిచ్చి తాను నేను మాటలాడకుండినా తా-
ననిపినచెలితో మాటాడకుండలేనే
(॥చెప్ప॥)
కొంకి తన్నంట నేనని గొప్పవొట్టు వెట్టుకొన్న
అంకె దాఁబండేపరపు అంటకుండలేనే
నంటుచేసి తనతోనే నవ్వుది నవ్వకుండినాను
గెంటుఁదనమేనిపచ్చికి నవ్వకుండలేనే
(॥చెప్ప॥)
సమరతి నలయక చలముదించకుండినా
ఆమరఁగఁ బరవశమందకుండలేనే
తెమలి శ్రీవేంకటాద్రిదేవుఁ డింత సేసి కూడె
కొమెరవయసునసిగ్గులు మానలేనే
(||pallavi||)
sĕppibaṁpa niṁta yele sĕlulase sārĕsārĕ
yĕppuḍunu tanabuddi kĕdurāḍalene
(||sĕba||)
tanado nem̐ gobagiṁchi tanadikku sūḍagunna
sunisi tā nunna meḍa sūḍaguṁḍalene
manasichchi tānu nenu māḍalāḍaguṁḍinā tā-
nanibinasĕlido māḍāḍaguṁḍalene
(||sĕppa||)
kŏṁki tannaṁṭa nenani gŏppavŏṭṭu vĕṭṭugŏnna
aṁkĕ dām̐baṁḍebarabu aṁṭaguṁḍalene
naṁṭusesi tanadone navvudi navvaguṁḍinānu
gĕṁṭum̐danamenibachchigi navvaguṁḍalene
(||sĕppa||)
samaradi nalayaga salamudiṁchaguṁḍinā
āmaram̐gam̐ baravaśhamaṁdaguṁḍalene
tĕmali śhrīveṁkaḍādridevum̐ ḍiṁta sesi kūḍĕ
kŏmĕravayasunasiggulu mānalene