Seppave sirugaali sallagaa edagilli

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
Work
Year
Language

పల్లవి:

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ.. చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి

చరణం 1:

ఆశా దీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది

ఆ ...చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవా షికారులు
కురిసే సుగంధాల హోలీ ఓ.. చూపదా వసంతాలకేళి
కురిసే సుగంధాల హోలీ చూపదా వసంతాలకేళి

చరణం 2:

యమునా తీరాల కధ వినిపించేలా రాధామాధవుల జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళా చెవిలో సన్నాయి రాగంలా

ఓ ...కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాలా
లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఏదని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానాపదంలా పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లాసంగా తుల్లీ హో.. చూపదా వసంతాల కేళి
ఊపిరే ఉల్లాసంగా తుల్లీ హో.. చూపదా వసంతాల కేళి

pallavi:

sĕppave sirugāli sallagā ĕdagilli
sĕppave sirugāli sallagā ĕdagilli
ĕkkaḍe vasaṁtāla keḽi o.. sūbave nīdo tīsugĕḽḽi
ĕkkaḍe vasaṁtāla keḽi sūbave nīdo tīsugĕḽḽi

saraṇaṁ 1:

āśhā dībigalai mĕrise tāragalu sūse dībigalai virise korigalu
manado jadai sāguduṁṭe ho aḍuge alai pŏṁguduṁdi

ā ...suṭṭū iṁkā reyunnā aṁtā kāṁte sūstunnā
ĕkkaḍa ĕkkaḍa ĕkkaḍa veguva aṁṭū rĕkkalu vippugu ĕgire kaḽḽu
dikkulu tĕṁchugu dūsugubodū uṁṭe ābagalavā ṣhigārulu
kurise sugaṁdhāla holī o.. sūbadā vasaṁtālageḽi
kurise sugaṁdhāla holī sūbadā vasaṁtālageḽi

saraṇaṁ 2:

yamunā tīrāla kadha vinibiṁchelā rādhāmādhavula jada kanibiṁchelā
pāḍanī vĕnnĕllo ī veḽā sĕvilo sannāyi rāgaṁlā

o ...kalale nijamai aṁdelā ūge ūhala uyyālā
lāhiri lāhiri lāhiri tāraṁgāla rādiri edani īde veḽa
jājiri jājiri jājiri jānābadaṁlā pŏdde palagariṁchāli
ūbire ullāsaṁgā tullī ho.. sūbadā vasaṁtāla keḽi
ūbire ullāsaṁgā tullī ho.. sūbadā vasaṁtāla keḽi