Seppave naagoga buddi seliya voohimchi neevu

చెప్పవే నాకొక బుద్ది చెలియ వూహించి నీవు
Language

(॥పల్లవి॥)
చెప్పవే నాకొక బుద్ది చెలియ వూహించి నీవు
యెప్పడూ నా కోరికలు యీడేరునే కదవే

(॥చెప్ప॥)
అనిశము నాచూపులు ఇతని మైఁ బారఁగాను
మనసులో నన్నతఁడు మరచీనటే
వెనువెంట నాసుద్దులు వీనులలోఁ దగులఁగా
ఘనమైన వలపు రేఁగనేవలెఁగదవే

(॥చెప్ప॥)
గక్కన నేనంపిన కానుక చే నుండఁగాను
యెక్కడి పరాకులు యేలయ్యానే
తక్కిన నాతమకము తనపైఁ బొలయఁగాను
కిక్కిరించి నాపై దయ కెరలునే కదవే

(॥చెప్ప॥)
చేరి నేఁజల్లిన సేస శిరసుపై నుండఁగాను
వేరొకతె పొందులను వెలసీనటే
యీరీతి శ్రీవేంకటేశుఁ డే నలమేల్మంగను
మేరతో నన్నేలే నిఁక మేలౌనే కదేవే

(||pallavi||)
sĕppave nāgŏga buddi sĕliya vūhiṁchi nīvu
yĕppaḍū nā korigalu yīḍerune kadave

(||sĕppa||)
aniśhamu nāsūbulu idani maim̐ bāram̐gānu
manasulo nannadam̐ḍu marasīnaḍe
vĕnuvĕṁṭa nāsuddulu vīnulalom̐ dagulam̐gā
ghanamaina valabu rem̐ganevalĕm̐gadave

(||sĕppa||)
gakkana nenaṁpina kānuga se nuṁḍam̐gānu
yĕkkaḍi parāgulu yelayyāne
takkina nādamagamu tanabaim̐ bŏlayam̐gānu
kikkiriṁchi nābai daya kĕralune kadave

(||sĕppa||)
seri nem̐jallina sesa śhirasubai nuṁḍam̐gānu
verŏgadĕ pŏṁdulanu vĕlasīnaḍe
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelmaṁganu
merado nannele nim̐ka melaune kadeve