Seppave naadonela sigguvadevu

చెప్పవే నాతోనేల సిగ్గువడేవు
Language

(॥పల్లవి॥)
చెప్పవే నాతోనేల సిగ్గువడేవు
కప్పురగంది నీచెలికత్తెఁ గానా నేను

(॥చెప్ప॥)
చెలరేఁగి నీవలపు చెక్కులవెంటఁ గారీ
చెలియరో నీపతికిఁ జెప్పుదునటే
నిలువునఁ దమకము నిట్టూర్పులై మించీ
పిలుచక వత్తునటే ప్రియుని నీడకును

(॥చెప్ప॥)
అట్టె నివ్వెరగు నీపయ్యదతోనే జారీని
చుట్టపునీవిభునికిఁ జూపుదునటే
గుట్టుతోడఁ బులకలు గుబ్బతిలీఁ జెక్కులను
దట్టపునీపొందులు తలఁపింతునటవే

(॥చెప్ప॥)
చేవమీరి నవ్వులు నీసెలవులవెంటఁ జిందీ
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జెందెనటవే
నీ వలమేలుమంగవు నెక్కొని నీ ప్రియములు
సేవసేనే మీకు నేను చెప్పఁగదవే

(||pallavi||)
sĕppave nādonela sigguvaḍevu
kappuragaṁdi nīsĕligattĕm̐ gānā nenu

(||sĕppa||)
sĕlarem̐gi nīvalabu sĕkkulavĕṁṭam̐ gārī
sĕliyaro nībadigim̐ jĕppudunaḍe
niluvunam̐ damagamu niṭṭūrbulai miṁchī
pilusaga vattunaḍe priyuni nīḍagunu

(||sĕppa||)
aṭṭĕ nivvĕragu nībayyadadone jārīni
suṭṭabunīvibhunigim̐ jūbudunaḍe
guṭṭudoḍam̐ bulagalu gubbadilīm̐ jĕkkulanu
daṭṭabunībŏṁdulu talam̐piṁtunaḍave

(||sĕppa||)
sevamīri navvulu nīsĕlavulavĕṁṭam̐ jiṁdī
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jĕṁdĕnaḍave
nī valamelumaṁgavu nĕkkŏni nī priyamulu
sevasene mīgu nenu sĕppam̐gadave