చెప్పవే ఆ సుద్దులు నే చెవులార వినేఁగానీ
(॥పల్లవి॥)
చెప్పవే ఆ సుద్దులు నే చెవులార వినేఁగానీ
యిప్పు డాతనికి వావి యేమౌదువే
(॥చెప్ప॥)
గుఱుతుగా నావిభునిఁ గొచ్చకొచ్చి చూచేవు
యెఱుఁగుదువటవే నీ వీతనిఁ దొల్లి
మఱియునుఁ దమకించి మాటలాడఁబొంచేవు
జఱసి యిదీఁ గోంత సంగాతము గలదా
(॥చెప్ప॥)
సంగడి గూచుండి నీవు సరసములాడేవు
అంగవించి పెండ్లాడినఆలవటవే
చెంగట నప్పటి నీవు సేవలు సేయవచ్చేవు
అంగడిఁ గొనుకవచ్చీతటవే యీవలపు
(॥చెప్ప॥)
తోడరి శ్రీవేంకటేశుతోడ నీవు నవ్వేవు
కడు నీకీయలవాటు గలదటవే
యెడయ కితఁడు నావాఁ డే నలమేలుమంగను
బడివాయకుందానవు పాలిదానవైతివా
(||pallavi||)
sĕppave ā suddulu ne sĕvulāra vinem̐gānī
yippu ḍādanigi vāvi yemauduve
(||sĕppa||)
guṟudugā nāvibhunim̐ gŏchchagŏchchi sūsevu
yĕṟum̐guduvaḍave nī vīdanim̐ dŏlli
maṟiyunum̐ damagiṁchi māḍalāḍam̐bŏṁchevu
jaṟasi yidīm̐ goṁta saṁgādamu galadā
(||sĕppa||)
saṁgaḍi gūsuṁḍi nīvu sarasamulāḍevu
aṁgaviṁchi pĕṁḍlāḍinaālavaḍave
sĕṁgaḍa nappaḍi nīvu sevalu seyavachchevu
aṁgaḍim̐ gŏnugavachchīdaḍave yīvalabu
(||sĕppa||)
toḍari śhrīveṁkaḍeśhudoḍa nīvu navvevu
kaḍu nīgīyalavāḍu galadaḍave
yĕḍaya kidam̐ḍu nāvām̐ ḍe nalamelumaṁganu
baḍivāyaguṁdānavu pālidānavaidivā