Seppavayyaa vinemgaani sevulu sallamgaa nemdu

చెప్పవయ్యా వినేఁగాని చెవులు చల్లఁగా నేఁడు
Language

(॥పల్లవి॥)
చెప్పవయ్యా వినేఁగాని చెవులు చల్లఁగా నేఁడు
దప్పిదేరి నీ మనసు తమకించెనా

(॥చెప్ప॥)
వలపులనీసుద్దులే వడిగాఁ జెప్పేవు నాతో
వెలయ వింకా నవి వేడుకయ్యీనా
మొలకలు చన్నులంటా ముందరనే పొగడేవు
అలర నందుపై నీకు ఆసలు వుట్టీనా

(॥చెప్ప॥)
నావద్దనే కూచుండి నవ్వులెల్లా నవ్వేవు
చేవదేరి నీమదము చిమ్మిరేఁగెనా
బావించి నేఁ బండుండఁగా పక్క నిట్టె పండుఁడేవు
కావలసి నామీఁద కరుణ వొడమెనా

(॥చెప్పు॥)
తప్పకిట్టె నామోము తతిగొని చూచేవు
ముప్పిరి నాకింత మోహించితివా
కప్పి శ్రీవేంకటేశుఁడ కాఁగిలించి కూడితివి
యెప్పుడు నాకీచనవు లియ్యదొరకొంటివా

(||pallavi||)
sĕppavayyā vinem̐gāni sĕvulu sallam̐gā nem̐ḍu
dappideri nī manasu tamagiṁchĕnā

(||sĕppa||)
valabulanīsuddule vaḍigām̐ jĕppevu nādo
vĕlaya viṁkā navi veḍugayyīnā
mŏlagalu sannulaṁṭā muṁdarane pŏgaḍevu
alara naṁdubai nīgu āsalu vuṭṭīnā

(||sĕppa||)
nāvaddane kūsuṁḍi navvulĕllā navvevu
sevaderi nīmadamu simmirem̐gĕnā
bāviṁchi nem̐ baṁḍuṁḍam̐gā pakka niṭṭĕ paṁḍum̐ḍevu
kāvalasi nāmīm̐da karuṇa vŏḍamĕnā

(||sĕppu||)
tappagiṭṭĕ nāmomu tadigŏni sūsevu
muppiri nāgiṁta mohiṁchidivā
kappi śhrīveṁkaḍeśhum̐ḍa kām̐giliṁchi kūḍidivi
yĕppuḍu nāgīsanavu liyyadŏragŏṁṭivā